ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ముందుకెళ్తా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్తానని, తద్వారా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వా న్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలు పరిష్కా రమయ్యేందుకు కృషి చేస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత ఎంపికైన సందర్భంగా భట్టి విక్రమార్క శనివారం విూడి యాతో మాట్లాడారు.. రాహుల్‌ ఆశీస్సులతో సీఎల్పీ నేతనయ్యానని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన సైనికులని, ఎవరూ పార్టీ మారరని

తెలిపారు. ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలనుకొనే ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ విధంగా ఉంటుందని ఆశిస్తున్నానని భట్టి పేర్కొన్నారు. గత పిరియడ్‌లో సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి ప్రభుత్వం తనదైన శైలిలో అసెంబ్లీలో పోరాటం సాగించారని అన్నారు. తన విధానంలో హూందాగా సభలో తనతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు ప్రవర్తించేలా చూసి పార్టీగౌరవాన్ని పెంచారని భట్టి అన్నారు. ప్రస్తుతం తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుని వెళ్తూ.. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్రంలో పలు సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భట్టి తెలిపారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆ సమస్యలపై దృష్టిసారించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలిపారు. సభలో ప్రతిపక్ష పక్షం పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరుపట్ల తమ ప్రవర్తన ఉంటుందని భట్టి స్పష్టం చేశారు. మృదువుగానైనా, కఠినంగానైనా ప్రభుత్వంపై పోరాడుతానని, అందుకు పార్టీ ఎమ్మెల్యేలు సిద్దంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here