సెట్లర్లంతా..మావైపే

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఉన్న సిటిలర్లంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, టీఆర్‌ఎస్‌ పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని నిజామాబాద్‌ తెరాస ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె విూడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతారు.. తెరాసను కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన భార్యకు టికెట్‌ ఎలా ఇప్పించుకున్నారని నిలదీశారు. ఉత్తమ్‌కు నైతికత ఉంటే టికెట్‌ ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్‌ చేశారు. కుటుంబ పాలన తెరాసది కాదని, కాంగ్రెస్‌దేనని కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు కుటుంబసభ్యులకే సీట్లు పంచుకున్నారని ఆరోపించారు. బీసీలకు సీట్ల విషయంపై కాంగ్రెస్‌ వాళ్లే విమర్శించుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినా ప్రభావం ఏవిూ ఉండదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో తెదేపానే తిరస్కరించినప్పుడు అభ్యర్థి ఎవరు ఉన్నా లాభమేంటని ప్రశ్నించారు. సెటిలర్లు తెరాసకే ఓటు వేస్తారని.. తెరాస ప్రజాప్రతినిధులతోనే పనిచేయించుకుంటామని అంటున్నారని కవిత పేర్కొన్నారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీ ఒకే వేదికపైకి వచ్చి ప్రచారం చేస్తే చూడాలని ఉందని కవిత అన్నారు. ప్రచారానికి వెళ్తే ప్రజలంతా తెరాస నేతలపై ఆప్యాయత చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పేరే ఎత్తడం లేదని చెప్పారు. గల్ఫ్‌ కార్మికులను ఆదుకుంది తెరాస ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణలో తెరాస పట్టు నిలబెట్టుకుంటామన్నారు. నల్గొండలో మళ్లీ ఆరు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల సీటు గెలిచి కేసీఆర్‌కు కానుగా ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్‌కు వందకు పైగా స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. కొత్తగా సెటిలర్లపై కాంగ్రెస్‌కు ప్రేమ పుట్టుకువచ్చిందన్నారు. అందుకే కుసుమ కుమార్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చారు. కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తారని రేణుకా చౌదరి అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారు అని చెప్పారు. రూరల్‌, అర్బన్‌ అనే తేడా లేదు.. అంతటా టీఆర్‌ఎస్‌ హవానే అని ఆమె స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here