సీఎంలంతా మా గులాములే..!

0

– వైఎస్‌, కేసీఆర్‌.. ఎవరైనా.. మాముందు తలవంచాల్సిందే!

– డిసెంబర్‌11 తరువాత తడాఖా చూపిస్తాం

– మళ్ళీ మాట జారిన అక్బరుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తల వంచాల్సిందేనని ఆల్‌ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లివిూన్‌(ఏఐఎంఐఎం) నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు.. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రోశయ్య, కేసీఆర్‌ వరకూ అందరూ తమ మాటకు గౌరవం ఇచ్చారని తెలిపారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేదని మజ్లిస్‌ పార్టీయేనని వెల్లడించారు. డిసెంబర్‌ 11 తర్వాత మజ్లిస్‌ బలమేంటో ప్రపంచం చూస్తుందని అక్బరుద్దీన్‌ అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తలవంచాల్సిందేనని అక్బర్‌ పునరుద్ఘాటించారు. తాను కింగ్‌ కాదనీ, కింగ్‌ మేకర్‌ ననీ చెప్పారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు మరింత సున్నితంగా తయారు అయ్యాయనీ, ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కాగా, అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో పలుమార్లు అక్బరుద్దీన్‌ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. కాగా ప్రస్తుతం నేరుగా మేం ఏం చెబితే అదే తెలంగాణలో జరుగుతుందనే రీతిలో వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకియాల్లో మజ్లిస్‌ పార్టీపై తీరుపై చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం అనధికారికంగా కూటమిగా ఏర్పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here