Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

అవార్డులన్నీ….. అంగట్లో సరుకులేనా…

జిల్లా నుంచి జాతీయం వరకు అంతే..

బయట కనబడని ఎంపిక ప్రక్రియ..

తెల్లారేలోపు పేర్లన్నీ తారుమారు..

సగానికిపైగా పైరవీలతోనే ఎంపిక..

అవార్డులంటే ఏలా ఉండాలి.. నీతిగా, నిజాయితీగా పనిచేస్తూ మరొకరికి స్పూర్తినిచ్చే వ్యక్తులకు ఆవార్డులు అందించాలి.. జిల్లా కాని, రాష్ట్రం కాని, జాతీయ అవార్డు ఏదైనా కాని అవార్డు తీసుకున్న వ్యక్తులను చూసి మరొకరు అంత నీతిగా పనిచేయాలనే ఆలోచన రావాలి. వారిలో కసి పెరిగి, కష్టపడే తత్వం రావాలి.. అంతకంటే ఎక్కువగా పనిచేసి వచ్చే సంవత్సరం తాను కూడా అవార్డు తీసుకోవాలనే ఆలోచనతో ఉండాలి.. అప్పుడే అవార్డు తీసుకున్నవారు మరో తరానికి స్పూర్తిగా నిలుస్తారు.. కాని నేడు ఆవార్డులన్నీ అంగట్లో సరుకులయ్యాయి. నీతి, నిజాయితీ కంటే పైరవీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరిస్తున్నారో, ఎవరికిస్తున్నారో, ఎప్పుడు ఎంపిక చేస్తున్నారో తెలియకుండా అంతా రహస్యంగా చకచకా జరిగిపోతుంది.. కష్టపడే తత్వాన్ని చూసి, నిబద్దతతో చేసే పనితనాన్ని చూసి, అభ్యర్థి గుణగణాలు తెలుసుకొని ఎంపిక చేయాల్సిన యంత్రాంగం అంతా తూతూ మంత్రంగా చేస్తూ చేతులు దులుపుకుంటుంది. నాయకులకు నచ్చినవారికో, అధికారులు చెపుతే వింటున్న వారికో అవార్డు గ్రహితలుగా, ఉత్తమ అధికారులుగా, ప్రశంసలు కురిపిస్తూ సన్మానిస్తున్నారు.. నేడు ప్రభుత్వం అందించే ఆవార్డులంటే పైరవీలేనిదే రాదని ప్రచారం బలంగా ఉంది. నిజంగా ప్రజల కోసం పనిచేసే వారు ఎప్పుడు గుర్తింపు కోసం, పేరు, ప్రతిష్టల కోసం, ఆరాటపడరు, తాపత్రయ పడరు. కాని ఇక్కడ ఆవార్డు గ్రహీతలు దాదాపుగా ఉత్తుత్తి ఉత్తమ అధికారులేననే నిజం అంతర్గతంగా తెలిసినా బహిర్గతంగా బయటపడేవారు కొద్దిమందే ఉన్నారు. అడుగులకు మడుగులత్తే వారికి, అమ్యామ్యాలు సమర్పించే వారికి ఉత్తములని గుర్తించే అధికారులు వారి ఉద్యోగ చరిత్ర, వారి ప్రవర్తన, పనితీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలియడం లేదు.. ఉత్తమ అధికారుల ఎంపికలోనే సరియైన నియమాలు పాటించలేనప్పుడు తుప్పు కాకుండా నాణ్యతతో కూడిన అధికారులకు గుర్తింపు రావడం గగనమే.. ఒక్కోసారి కొంతమందిని చూసినప్పుడే ఎంపికైనా వారు, ఎంపిక చేసినా వారు ఒకే తాను ముక్కలే ఐనప్పుడు వారికి ఉత్తుత్తి అధికారులే తప్ప అసలైన, నిఖార్సైన అధికారులు కనబడరు, కనబడినా వారికి గుర్తింపు ఇవ్వరు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

చేసే పనిని, మనిషి ప్రవర్తనను మరో తరానికి స్పూర్తిగా నిలిచే వారికి ఆవార్డులతో సత్కరిస్తారు. గతంలో సమాజం కోసం, ప్రజల సేవ కోసం తపించే వారందరికి వారి వారి స్థాయిలను, రంగాలను బట్టి రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆవార్డులతో సత్కరించేవారు. కాని నేడు ఆవార్డులంటేనే అదొక వ్యాపారంగా మారిపోయింది. నిక్కచ్చిగా మాట్లాడేవారికి, నిజాయితీగా పనిచేసే వారిని పక్కనపెడుతూ ఎవరి పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉండేవారిని నామినేట్‌ చేస్తూ ఆవార్డులతో సత్కరించడం ఇప్పటి రోజుల్లో ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే ఆవార్డులలో నోటిపికేషన్‌ ఎప్పుడోస్తుందో తెలియదు. ఎవరు దరఖాస్తు చేస్తారో తెలియదు. ఎవరూ ఎంపిక అవుతున్నారో సమాచారం ఉండదు. ఆవార్డు మీద ఆసక్తితో నిజమైన అర్హులు దరఖాస్తు చేసినా చివరికి వారికి మొండిచెయ్యే మిగులుతోంది. ఆవార్డులు తీసుకునే వరకు ఫలానా వారికి వచ్చిందా అనే విషయాన్ని కూడా తెలవకుండా దాస్తున్న సంఘటనలు ఉన్నాయి..

ఎసిబికి వలలో ఉత్తమ ఆవార్డు గ్రహీతలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ ప్రత్యేక దినోత్సవాలకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలంందించిన వారందరికి ఆవార్డులు ఇస్తున్నారు. ఆవార్డులు తీసుకునే వరకు తెలియదు ఎవరికి వచ్చిందో, ఏలా వచ్చిందో.. రాత్రికే రాత్రే కాగితాలపై పేర్లు మారిపోతాయి. అవినీతిపరులు సైతం ఉత్తమ అధికారులుగా సత్కారం పొందుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో సునిత అనే తహశీల్దార్‌ ప్రజలకు విశిష్ట సేవలందిస్తుందని, ఆవిడ సేవలు ఎంతో నిరూపమైనవని కొనియాడుతూ ప్రభుత్వం వివిధ ఆవార్డులు అందజేసింది. ఉత్తమ అధికారిగా ఎంపిక చేసి మరీ మరీ సన్మానించారు. కాని కొద్ది రోజుల్లోనే ఆవిడ పనుల కోసం వచ్చే రైతులను పీడించడం, ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వేలల్లో, లక్షల్లో వసూలు చేయడంతో ఆమె బండారం బయటపడింది. ఒక మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న అధికారి దగ్గర నగదు డబ్బే తొంబై మూడు లక్షలు దొరికాయంటే అదీ మామూలు విషయం కాదు. ఇంకా బినామీల పేర్లమీద ఎంత దాచిందో ఊహిస్తేనే గుండె ఆగిపోతుంది. రైతులు ఏ పనిమీదైనా తహశీల్దారు కార్యాలయానికి వస్తే చాలు నోటు ఇస్తేనే ఫైలు కదులుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకున్న కూడా పనులు కోసం తిప్పించుకోవడం ఆమెకు అలవాటని అక్కడి ప్రజలు అంటున్నారు. అంత బారీ అవినీతి తిమింగలాన్ని మన జిల్లా అధికారులు, మనలను పాలించే పాలకులు ఉత్తమ అధికారిగా ఎంపిక చేసి సత్కారం చేశారు. అంటే ఆవిడ రేపటి తరానికి, రాబోయే తరానికి స్పూర్తివంతురాలని చెప్పకనే చెప్పినట్టు చెప్పారని అనుకోవచ్చు. మొన్నటికి మొన్న ఆగష్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉత్తమ కానిస్టేబుల్‌గా అవార్డు అందుకున్నా తిరుపతిరెడ్డి ఆగస్టు పదహరవ తేదీన ఇసుక రవాణా చేస్తున్న వారి దగ్గర నుంచి డెబ్బె వేల రూపాయలు తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న మరుసటి రోజు ఎసిబికి చిక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా అవార్డులపై అందరి దృష్టి పడింది.

అవార్డులు నియామకంలోనే డొల్ల..

ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి జిల్లా కలెక్టర్‌ ఉత్తమ సేవలందించిన వారి పేర్లు పంపాలని కోరుతారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు నీతిగా, నిజాయితీగా పనిచేసే వారిని కాదని వారు చెప్పిన మాట వినేవారికి, ప్రతి నెల అమ్యామ్యాలు సమర్పించే వారికే అవార్డుకు పేరు నామినేట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పేర్లు పైనల్‌ చేసి పంపడంతో జిల్లా కలెక్టర్‌ కూడా అదే పేర్లను పైనల్‌ చేస్తూ అవార్డుకు అందిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు పేర్లు ఇస్తున్నప్పుడు వాటిపై జిల్లా కలెక్టర్లు వారు ఉత్తమ అధికారిగా అర్హులా, కాదా అనే విషయంపై విచారణ చేయడం లేదు. దీనివల్ల ఎంపికలో అసలైన వారికి అన్యాయం జరుగుతూ పైరవీల ద్వారా అవార్డులు తీసుకుంటున్నారనే ఆరోపణలు మొదటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా చిన్న జిల్లాలు కావడంతో ఎవరూ ఉన్నా లేకున్నా అధిపత్యం చెలాయించే వారికే, పైరవీదారులకు, లేదా ఇచ్చిన వారికే ఇస్తున్నారని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డుల ఎంపిక మాత్రం మొత్తం డొల్ల అనే తెలుస్తోంది. ా

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close