సంక్షోభంలో ఎయిరిండియా

0

న్యూఢీల్లీ : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మరో విమానయాన సంస్థ ఎయిరిండియా నిధులను సమకూర్చుకునేందుకు తన సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాల్సిందిగా ఉద్యోగులను కోరింది. దిల్లీలోని సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాలని అడిగింది. దిల్లీలోని వసంత్‌ విహార్‌ కాలనీలో ఎయిరిండియాకు 800 ఫ్లాట్లున్నాయి. వీటిలో 676 ఫ్లాట్లలో ఎయిరిండియా సిబ్బంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీటిని ఖాళీ చేయించి వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. దీంతో పాటు సరైన ఇళ్లు వెతుక్కోవడంలో సిబ్బందికి సాయం చేస్తామని కూడా చెప్పింది. అయితే ఇక్కడ నివాసం ఉంటోన్న ఉద్యోగుల్లో చాలా మంది బయటి రాష్ట్రాల వ్యక్తులే. పిల్లల పాఠశాలకు దగ్గరగా ఉండేలా ఇళ్లు చూసుకోవడం ఇప్పట్లో చాల కష్టమైన పనని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఈ సంస్థకు సోషల్‌ మీడియా ద్వారా మరిన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో సంస్థ గురించి గానీ, పని వివరాల గురించి గానీ మీడియా, సోషల్‌ మీడియాలో మాట్లాడవద్దంటూ సిబ్బందికి సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడాల్సి వస్తే అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఎయిరిండియా పనైపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా వ్యాపిస్తున్నాయని, వీటివల్ల సంస్థ మరింత సమస్యల్లో పడే అవకాశం ఉందని ఆ సంస్థ అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తప్పవని సంస్థ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here