Featuredజాతీయ వార్తలు

ఎయిర్‌ ఇండియా విమానం హైజాక్‌..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎయిర్‌ ఇండియా విమానం హైజాక్‌ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కాగా.. ఉగ్రవాదుల కుట్రను నిఘా వర్గాలు భగ్నం చేశాయి.కాబూల్‌లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్‌ చేసి దేశంలోనే ఏదో ఒక విమానాశ్రయంలో దింపడానికి ఉగ్రవాదుల పథకాన్ని గుర్తించిన నిఘా వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా విమానా శ్రయాల్లో యాంటీ హైజాకింగ్‌ బ ందాలను మోహరిం చారు. అటు శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు. భారత విమానాన్ని హైజాక్‌ చేయడం ద్వారా కశ్మీరులో పట్టుబడిన ఉగ్రవా దులను విడిపించుకునేందుకు ముష్కరులు కుట్ర పన్నారా? కాబూల్‌ కేంద్రంగా ఆయుధాలతో విమానంలోకి ప్రవేశించేలా కుట్రకు తెరతీశారా? ఈ ప్రశ్నలకు నిఘా వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం.. దానికి అనుగుణంగా హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైజాక్‌ నిర్వీర్య దళం అత్యవసర కసరత్తు మొదలుపెట్టడం వంటి చర్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. విమానాల హైజాక్‌కు సంబంధించి నిఘా సంస్థలు అప్పుడప్పుడూ అప్రమత్తత సందేశాలు (జనరల్‌ ఎలర్ట్‌) ఇస్తుంటాయి. అందుకు భిన్నంగా రెండు రోజుల క్రితం కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ”అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నుంచి బయల్దేరే ఎయిర్‌ ఇండియా విమానాన్ని హైజాక్‌ చేస్తారు. దాన్ని భారతదేశంలోని ఏదో ఒక విమానాశ్రయంలో దింపుతారు. తర్వాత బేరసారాలు సాగించి కశ్మీరులో పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదులను విడిపించుకుని వెళ్లాలన్నది లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కుట్ర” అనేది ఆ సందేశం సారాశం. కశ్మీరు లోయలో ఎల్‌ఈటీతోపాటు హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలు ఉద్ధ తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలకు చెందిన అనేక మందిని ఇటీవల భద్రత బలగాలు పట్టుకున్నాయి. ఇలా పట్టుబడిన వారిలో ముఖ్య నేతలను విడిపించుకునేందుకు ముష్కరులు కుట్ర పన్నారని, అందులో భాగంగానే కాబూల్‌ నుంచి బయలుదేరే విమానాన్ని హైజాక్‌ చేసేందుకు వ్యూహం రచిస్తున్నారని ఐబీ గుర్తించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు జరుపుతున్న ఉగ్రవాదుల మధ్య అత్యంత రహస్యంగా సాగిన సంభాషణ ఆధారంగా ఆ సమాచారాన్ని రాబట్టింది. ”అఫ్గానిస్థాన్‌ కూడా ఉగ్రవాదులకు స్వర్గధామం కావడంతో స్థానికుల సహకారంతో ఆయుధాలతో విమానంలోకి ప్రవేశించ వచ్చనేది ఉగ్రవాదుల వ్యూహం కావచ్చు. విమానాన్ని హైజాక్‌ చేసే పక్షంలో దాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుంటుంది. అందుకు భిన్నంగా దేశంలోని ఏదో విమానాశ్రయంలో నిలిపి బేరసారాలు జరిపితే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమ డిమాండ్లకు తలొగ్గుతుందనేది కూడా ఉగ్రవాదుల వ్యూహం కావొచ్చు” అని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలతో హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వెనువెంటనే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది పరిస్థితిని సమీక్షించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో జాతీయ భద్రత దళం(ఎన్‌ఎస్‌జీ)లోని హైజాక్‌ నిర్వీర్య దళాన్ని మోహరించారు. ఆయన ఆధ్వర్యంలో ఆ దళం అత్యవసర కసరత్తు ఆరంభించింది. శంషాబాద్‌ విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌), స్థానిక పోలీసులు, పౌర విమానయానశాఖ అధికారులు కూడా అవసరమైన అత్యవసర చర్యలు ఆరంభించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close