కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగాముందుకు సాగుతున్న సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టుల పనితీరుపై దృష్టి సారించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై .. ప్రగతిభవన్‌లో సవిూక్షించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులు మంత్రులతో సవిూక్ష నిర్వహిస్తున్న కేసీఆర్‌ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులపై చర్చించారు. ఈ భేటీకి.. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్‌, జగదీష్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, కాకతీయ కాల్వ ఆధునీకరణ.. తదితర పనుల పురోగతిపై బుధవారం జలసౌధలో జరిగిన సవిూక్షలో పలువురు ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు భేటీ అయ్యారు. పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. దీనికి కొనసాగింపుగా సిఎం కెసిఆర్‌ ఆయకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, నీటిపారదుల శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీరాంసాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 30 టీఎంసీల నీరుందని, ఇదివరకే ఎల్‌ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు నీరందించామని, ఈ నెల పదో తేదీ నుంచి ఎల్‌ఎండీ దిగువకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎల్‌ఎండీ ఎగువన నాలుగు తడులుగా 20 టీఎంసీల నీటిని అందించనుండగా.. దిగువన ఉన్న ఆయకట్టుకు రెండు తడుల కింద నాలుగు టీఎంసీలు ఇస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ కింద వాస్తవానికి 14.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. సమైక్య పాలకులు ఏనాడూ ఐదు లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందించలేదని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో చివరి భూముల వరకు ప్రతి ఎకరాకూ నీళ్లందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ దశలో వాస్తవ పరిస్థితులను సిఎం అడిగి తెలుసుకున్నారు. ఇందు కోసం డిస్టిబ్యూట్రరీలనూ బలోపేతం చేసుకుంటున్నట్టు చెప్పారు. అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలని సీఎం కేసీఆర్‌ సూచించారని తెలిపారు. సమావేశపు సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు సమర్పించారు. దీనిపై సిఎం వివరాలు తెలుసుకున్నారు.

పల్లె ప్రణాళికలు

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని … గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ పర్సన్స్‌తో ప్రగతి భవన్‌లో సీఎం సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలను కలుపుకొని సామూహికంగా గ్రామ వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని సీఎం కోరారు. మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం తదితర అంశాలపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఛేంజ్‌ ఏజెంట్స్‌గా మార్చే బాధ్యతను రిసోర్స్‌ పర్సన్స్‌ చేపట్టాలని కేసీఆర్‌ అన్నారు. గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటామని, అదే సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేసే విధంగా కఠిన చట్టాన్ని రూపొందించినట్లు సీఎం స్పష్టం చేశారు. సీఎస్‌ ఎస్కే జోషి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here