టీపీసీసీ చీఫ్‌ మార్పుపై ఏఐసీసీదే నిర్ణయం

0

నేనైతే రాజీనామా చేయలేదు

  • టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

నల్గొండ :

తాను టీపీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. టీపీసీసీ చీఫ్‌ మార్పుపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని తెలిపారు. అంతేకాని తాను టీపీసీసీ చీఫ్‌కు రాజీనామా చేస్తున్నానంటు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంగళవారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటామని చెప్పారు. పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్‌ తెలిపారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్య పద్మావతికి ఆసక్తి లేదని తెలిపారు. మరేవ్యక్తినైనా బరిలోకి దింపుతామని, కేంద్ర పార్టీ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అన్నారు. హుజూర్‌నగర్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని, ఇక్కడ ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి విదేయులన్నారు. ప్రతిపక్ష ¬దాలో రాష్ట్రంలోని సమస్యలపై, తన నియోజకవర్గం సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉత్తమ్‌ తెలిపారు.

టీపీసీసీ పదవిపై ఆశలేదు:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ పదవిపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. టీపీసీసీ పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. రాజీనామా అంశం ఉత్తమ్‌కే తెలియాలన్నారు. తనకు పీసీసీ పదవిపై ఆశ లేదని తేల్చి చెప్పారు. పీసీసీ కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని ప్రజలు తనకు కట్టబెట్టారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడతానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను, తన నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులను పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో పాటు రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తమ పరిదిని దాటి వ్యవహరిస్తున్నారని, పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని కోమటరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము సహకరిస్తామని, కానీ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంగళవారం వెలువడిన ప్రాదేశిక ఫలితాలు ఆశించిన మేర కాంగ్రెస్‌ పార్టీ సాధించలేక పోయిందని కోమటిరెడ్డి అన్నారు. ఫలితాలపై సమీక్షించి కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా తమవంతు కృషి చేస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here