మళ్లీ నేనే ప్రధాని

0

జమ్మూ కాశ్మీర్‌ : రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా లేహ్‌ లో మోడీ మాట్లాడుతూ.. నా చేతుల విూదుగా ఈరోజు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా ప్రజల ఆశీస్సులతో మళ్లీ తానే చేస్తానని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, అటువంటి సంస్కృతికి బీజేపీ చరమగీతం పాడిందన్నారు. పనులను సాగదీయడం, వాటిని తప్పుదారి పట్టించడం అన్నది లేకుండా తమ పని తీరు ఉంటుందన్నారు. ఈ సంస్కృతికి తమ ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు. లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, విభజన రాజకీయాలను ఈ అయిదేళ్ల కాలంలో దేశం నుంచి తరిమికొట్టామని మోడీ అన్నారు. లేహ్‌-లడఖ్‌ ను రోడ్డు, విమాన మార్గాలతో అనుసంధానించే రెండు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ మార్గాన్ని తొలిసారిగా రైల్వే మ్యాప్‌ తో జోడించే రైల్వే లైన్‌, కొత్త విమాన టర్నినల్‌ రెండు ఇక్కడ అభివృద్ధికి కొత్త రూపు ఇస్తాయని అన్నారు. బిలాస్‌ పూర్‌-మనాలీ-లేహ్‌ రైల్వే లైన్‌ కనుక పూర్తి అయితే ఢిల్లీ-లేహ్‌ ల మధ్య దూరం తగ్గుతుందన్నారు. పర్యాటరంగ అభివృద్ధికి కూడా ఇది బెన్‌ ఫిట్‌ అవుతుందన్నారు. ప్రొటెక్టడ్‌ ఏరియా పర్మిట్‌ వ్యాలిడిటీ 15రోజులకు పెంచడం జరిగిందని, ఇకపై పర్యాటకులు లేహ్‌ కి తమ జర్నీని ఎంజాయ్‌ చేయగల్గుతారని అన్నారు. అందరితో కలిసి అందరికీ అభివృద్ధి తమ నినాదమని తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని మోదీ ఉద్ఘాటించారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతుందరికీ రూ.2వేల సాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. పథకం అమలు కోసం అర్హుల పేర్లు, ఆధార్‌ నెంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శాకాలు జారీ చేశామని, వీలయినంత త్వరలో వారికి ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నుంచి సాయం అందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

దాల్‌ లేక్‌ లో మోడీ షికారు

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ శ్రీనగర్‌ లోని దాల్‌ లేక్‌ లో బోటులో పర్యటించారు. అంతకుముందు బందిపొరా, గందేర్బాల్‌, అవంతిపుర లోని వివిధ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. విజయపూర్‌ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ..కాశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రప్రభుత్వం కర్తవ్యబద్ధతతో కశ్మీరీ పండిట్ల ఆత్మాభిమానం, గౌరవం, హక్కుల అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హింస, ఉగ్రవాదం చెలరేగిన కాలంలో కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్లు వదిలి బయటకి పారిపోవలసి వచ్చిందని, ఇది భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని తెలిపారు. శ్రీనగర్‌ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మోడీ.. తన ప్రసంగాన్ని కశ్మీరీ భాషలో ప్రారంభించారు. వీరమరణం పొందిన నజీర్‌ అహ్మద్‌ వాణికి, దేశాన్ని రక్షించేందుకు, శాంతి నెలకొల్పేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు ఈ సందర్భంగా మోడీ తెలిపారు.నజీర్‌ అహ్మద్‌ వాణికి కేంద్రం అశోక్‌ చక్ర అవార్డు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here