Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

అఫిడవిట్‌ కేసు… ఉచ్చులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రమాణపత్రం మార్పు..?

  • పదవికి ఎసరు..!
  • ముందే చెప్పిన ‘ఆదాబ్‌’పై తప్పుడు కేసు
  • వచ్చే నెల 24న కౌంటర్‌ కు ఆదేశం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎక్సైజ్‌ శాఖా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. తన అఫిడవిట్‌ లో ఆయన అనేక విషయాలను దాచిన విషయాలను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ జూన్‌ 27 నుంచి జులై 4 వరకు పలు పరిశోధన కథనాలను అందించింది. ఆయన మంత్రి పదవికి గండం రానున్నదని కూడా స్పష్టంగా చెప్పింది.

హైకోర్టులో…: శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అఫిడవిట్‌ కేసుకు సంబంధించిన కేసులో వాదనలు జరిగాయి. మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ (74) నియోజకవర్గ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఎలక్షన్‌ పిటిషన్‌ నెం. 23/2019 నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌ తరఫున న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేయుటానికి 90 రోజుల సమయం అడగారు. పిటిషనర్‌ సి.రాఘవేంద్ర రాజు తరపు న్యాయవాది అభ్యంతరం తెలపారు. హైకోర్టు వచ్చేనెల 24న నాడు కౌంటర్‌ దాఖలు చేయవల్సిందిగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో పిటీషనర్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తన అఫిడవిట్‌ ఒకటి మార్చారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అసలేం జరిగింది : గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవంబర్‌ 13న ఒకటి, 19న మరొక నామినేషన్‌ సెట్‌ దాఖలు చేశారు. అందులో నేటి మంత్రి అనేక అబద్ధాలను అవలీలగా ఆడేశారు. అవి పొరపాటున, ఏమరపాటున జరిగినవి కావు. ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన అనేక విషయాలను దాచి పెట్టారు.

ఆబద్దం నెం.1: 2016లో రూ. 30 లక్షల విలువైన ఫార్చ్యూన్‌ వాహనం (నెం. టిఎస్‌ 0ఇఎల్‌ 6666) కొనుగోలు చేశారు. ఈ వాహనం ఆగష్టు 3, 2016 నుంచి మే 21, 2019 వరకు సరిగ్గా 41 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించారు.అందుకుగాను ఆ వాహనానికి సంబంధించి రూ.46,535లు అక్షరాలా జరిమానా కట్టాల్సి ఉంది.

ఆబద్దం నెం. 2: ఇక ఆయన సతీమణి విరసనోళ్ళ శారద పేరువిూద ఉన్న ఓల్వా (నెం. టిఎస్‌06ఇఆర్‌ 6666) వాహనాన్ని 2017లో అక్షరాలా 71లక్షల 82వేల రూపాయలతో కొనుగోలు చేశారు. జులై 22, 2017 నుంచి ఏప్రిల్‌ 7, 2019 వరకు సరిగ్గా 14 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించారు. రూ.16,390లు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందకు జరిమానా కట్టాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన తన ఎన్నికల అఫిడవిట్‌ లో ‘నో డ్యూస్‌’ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఈ జరిమానాలు కట్టకుండా… ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని చెప్పారు.

అమాత్యుల వారూ.. ఆస్తులూ దాచారు..: మంత్రి శ్రీనివాస్‌ తన సతీమణి ఆస్తులను (డాక్యుమెంట్‌ నెంబర్లు 7703/2014, 7704/2014, 143/2015) కలిగి ఉన్నారు.

అబద్ధం నెం 3: ఈ ఆస్తులు తనఖా పెట్టి మహబూబ్‌ నగర్‌ లోని పద్మావతి కాలనీలో గల ఆంధ్రప్రదేశ్‌ గ్రావిూణ వికాస్‌ బ్యాంక్‌ లో (డాక్యుమెంట్‌ నెం. 3331/ 2016, అకౌంట్‌ నెం. 73118697869) మార్టిగేజ్‌ లోను పొందారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.

అబద్ధం నెం.4: వాహనాల లోను ఉంది..అలాగే నెలవారీ చెల్లించే వాహన లోను రూ.8,44,000ల వివరాలను కూడా ఆయన దాచారు. ఆ లోను జనవరి28, 2019న కట్టారు. అంటే ఎన్నికల అఫిడవిట్‌ లో ప్రస్థావించలేదు.

అబద్ధం నెం.5: మంత్రి పేరుతో ఉన్న వాహనం ఫార్చ్యూన్‌ వాహనం (టిఎస్‌06 ఇఎల్‌ 6666) లోను హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంక్‌ లో 5 నెలల బకాయిలు రూ. 4,39,680లు ఉంది. ఈ విషయం కూడా రహస్యంగా ఉంచారు.

ముందు దాచి…తర్వాత చెప్పి..: హైదరాబాద్‌, జిహెచ్‌ఎంసీ, ఎస్బీహెచ్‌ శాఖలోని ఎకౌంటు నెంబర్‌ 62011824209 మొదటి అఫిడవిట్‌ లో చెప్పలేదు. ఈ విషయాన్ని ఫిర్యాదు అందిన తర్వాత రెండో అఫిడవిట్‌ లో సరిచేసుకున్నారు. అలాగే ఆయన సతీమణికి ద్యుతీ విూడియాలో 60వేల విలువైన షేర్ల విషయాన్ని మొదట దాచి, తర్వాత వెల్లడించారు.

నిజాలు రాస్తే కేసులా..?: ఈ సందర్భంగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’పై ఓ తప్పుడు కేసు కూడా నమోదయింది. ఆ సందర్భంలో ఆదాబ్‌ పాత్రికేయులు హైదరాబాద్‌ నగరంలో ఉండగా… మహబూబ్‌ నగర్‌ లో బెదిరించినట్లు అందమైన కథ అల్లారు. ఈ జిల్లాలో ఇలాంటి తరహా కేసుల జాబితా ఆదాబ్‌ సంపాదించింది. ‘ఆదాబ్‌’ జరిగిన కుట్రను బాహాటంగా ఆధారాలు చూపుతూ సమర్థవంతంగా తిప్పికొట్టిది. దీన్ని తెలుగు జర్నలిజంలో ఎవరూ ఊహించని విధంగా తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. నిలదీసి.. నిజాలను నిర్భయంగా చెప్పింది. అన్యాయాలకు, అక్రమాలకు, దౌర్జన్యయాలకు లొంగేది లేదని ఖరాఖండిగా చెప్పింది. ‘ఆదాబ్‌’ ప్రచురించిన భూకబ్జా కథనాలు, వాహనాల పన్ను సంగతులను ఇతర పత్రికలు కూడా కవర్‌ చేశాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close