గాడిద పాలతో యవ్వనంగా ఉంటారట..!

0

గంగిగోవు పాలు, గరిటెడైనా చాలు.. కడివెడైననేమి ఖరము పాలు.. అని కవి వేమన ఒక పద్యంలో చెప్పాడు. అంటే ఆవు పాలు గరిటెడు అయినా సరిపోతాయి.. కానీ గాడిద పాలు బిందె నిండా ఉన్నా వాటితో ఉపయోగం ఏమీ ఉండదని అర్థం వస్తుంది. అయితే నిజానికి అది చాలా పాత వాక్యం. ఎందుకంటే.. గాడిద పాలు నిజానికి చాలా మంచివేనని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. గాడిద పాలలో యాంటీ ఏజింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయట. అందువల్లే ఢిల్లీలోని ఓ స్టార్టప్‌ కంపెనీ గాడిద పాలతో సబ్బులను తయారు చేసి విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

ఢిల్లీకి చెందిన ఆర్గానికో అనే ఓ స్టార్టప్‌ కంపెనీ గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను అమ్ముతూ తక్కువ కాలంలోనే పేరు గడించింది. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మ దువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది కూడా. అందుకనే ఆర్గానికో కంపెనీ గాడిద పాలతో ఆర్గానిక్‌ సబ్బులను తయారు చేసి విక్రయిస్తూ ఖ్యాతి గడిస్తున్నది.

గాడిదపాల వల్ల మన చర్మానికి అంత త్వరగా వ ద్ధాప్య చాయలు రావట. అంటే ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉంటారన్నమాట. అలాగే గాడిద పాలు చర్మానికి కాంతిని అందిస్తాయి. చర్మం మ దువుగా మారేలా చూస్తాయి. అందుకనే ఇప్పుడు ఈ పాలతో తయారు చేయబడిన సబ్బులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఆర్గానికో సంస్థ వ్యవస్థాపకురాలు పూజా కౌల్‌ చెబుతున్నారు. గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్‌ గుణాలు ఉంటాయని, ఇవి మొటిమలను తగ్గిస్తాయని, చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయని పూజా చెబుతున్నారు.

మన దేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాల సబ్బులకు మంచి డిమాండ్‌ ఉందట. ఈ ప్రాంతాల్లోని పలువురు సబ్బులను కాకుండా ఏకంగా గాడిద పాలనే తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ క్రమంలోనే ఒక్క లీటర్‌ గాడిద పాలను రూ.1వేయి పెట్టి మరీ కొంటున్నారని తెలిసింది. కాగా గాడిద పాలను తాగడం వల్ల లైంగిక సమస్యలు పోతాయని, ఆస్తమా, ఆర్థరైటిస్‌, షుగర్‌ సమస్యలు తగ్గుతాయని అధిక శాతం మంది విశ్వసించి ఆ సమస్యల నుంచి బయట పడేందుకు గాడిద పాలను తాగుతున్నారట. ఏది ఏమైనా ఇప్పుడీ గాడిద పాల సబ్బులు మాత్రం నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here