Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

‘ఆదాబ్‌’ సెపితే… ఆళ్ళూ…వీళ్ళూ ఇనలే..!

ఈ ఒక్కసారికి ఒగ్గేయండి ప్లీజ్‌

?జాతీయ పార్టీ ¬దా తొలగించొద్దు

? ఎన్నికల సంఘానికి టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీ విన్నపం

? జులై19, 2019న చెప్పిన ఆదాబ్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తమకున్న జాతీయ పార్టీ ¬దా తొలగించొద్దని సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకునేందుకు తమకు మరో అవకాశం ఇవ్వాలని విన్నవించాయి. తాము జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని, కేవలం ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జాతీయ ¬దాను తొలగించొద్దని అభ్యర్థించాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓట్ల శాతం ఆధారంగా జాతీయ పార్టీ ¬దాపై ఈ మూడు పార్టీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల నేతలు సోమవారం ఈసీని కలిసి తమ వాదనలు వినిపించారు.

కాంగ్రెస్‌ పార్టీ తర్వాత అంతటి ప్రాచీనమైన పార్టీ తమదేనని, లోక్సభలో తమ పార్టీ చాలాసార్లు ప్రతిపక్షంగా ఉందని సీపీఐ ఈసీ ముందు వాదనలు వినిపించింది. ఇటీవలి ఎన్నికల్లో సరైన పనితీరు కనబరచకపోయినప్పటికీ పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ వచ్చామని, రాజ్యాంగ పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నామని పేర్కొంది. తమ పార్టీకి 2014లో జాతీయ పార్టీ ¬దా ఇచ్చారని, కాబట్టి కనీసం 2024 వరకు ఆ ¬దా కొనసాగించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీని కోరింది.

వాస్తవానికి 2014 ఎన్నికల ఫలితాల అనంతరం సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ జాతీయ ¬దాను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. అయితే 2016లో ఈసీ కొన్ని నిబంధనలను సడలించింది. జాతీయ, ప్రాంతీయ ¬దాల అంశాన్ని సవిూక్షించే విధానాన్ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. దీంతో ఆ పార్టీలు ఆ ¬దాలో కొనసాగుతూ వచ్చాయి. అయితే, ఇటీవల ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీ 10 లోక్సభ స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆ ముప్పు నుంచి తప్పించుకుంది.

నిబంధనల ప్రకారం ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జరిగే లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం లోక్సభలో నలుగురు సభ్యులను కలిగి ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌, భాజపా, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ మేఘాలయ.. జాతీయ పార్టీ ¬దాను కలిగివున్నాయి.

అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష ¬దా గల్లంతు..:

21 జనవరి, 2019లో ‘అసెంబ్లీలో ప్రతిపక్ష ¬దాపై కేసీఆర్‌ కన్ను’ అంటూ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ పరిశీలన కథనం అందించింది. అలాగే మిత్రపక్షమైన మజ్లీస్‌ కు ఆ ¬దా ఇవ్వబోతుందని చెప్పింది. అదే జరిగింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ మజ్లీస్‌ వెనుక కూర్చోవలసి వచ్చింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close