Featuredస్టేట్ న్యూస్

అక్రమ నిర్మాణాలకు రారాజు ఏసిపి నర్సింగరావు

ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నత అధికారులు

˜ అక్రమకట్టడాలలో నెంబర్‌ వన్‌ మల్కాజిగిరి సర్కిల్‌

మల్కాజిగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): మల్కాజిగిరి నియోజకవర్గం అక్రమాలకు కేరాఫ్గా మారింది. మల్కాజిగిరి సర్కిల్‌ లో ప్రతీ రోజు లక్షలరూపాయలు అక్రమ లావాదేవీలు సాగుతున్న విష యం అందరికీ తెలిసిందే. కాని ఎవరూ పట్టించుకోరు ఎందు కంటే ఏ అధికారి వాటా వారికి అందు తుంది. ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే ముప్పుతిప్పలు పెడతారు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అదే ముడుపుకు అందజేస్తే మీ జోలికి కూడా రారు. అంతే కాదు ఫిర్యాదు చేసినా పట్టిం చుకో రు దగ్గర ఉండి ఒక న్యాయవాదిని అప్పజెప్పి కోర్ట్‌ నుంచి స్టే ఆర్డర్‌ తెప్పించి ఇస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కోర్ట్‌ స్టే ఇచ్చింది మేము ఏమి చేయలేము అని కాకమ్మ కదలు చెబుతారు. ఇదే ఫార్ములా మల్కాజిగిరిలో ఇప్పుడు సూపర్‌ హిట్‌గా నడుస్తోంది. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధి లో మీర్జాల్‌ గుడా 141 డివిజన్‌ లోని యాక్సెస్‌ బ్యాంక్‌ మల్కా జిగిరి శాఖ పక్కనే 100గజాలు స్థలంలో యదే చ్చగా అక్రమ సెల్లార్‌ తవ్వకం చేసి సెల్లార్‌తో నిభందనలకు విరుద్దంగా కడు తున్న కట్టడాన్ని ఆపాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భారీగా మామూళ్లు తీసుకుని కుక్కిన పేను గాలా కుర్చున్నారు. స్థానిక కార్పోరేటర్‌ శిరీషా రెడ్డి భర్త జితెందర్‌ రెడ్డి హస్తం ఉందని స్థాని కుల ఆరోపణలు ఉన్నాయి. ఏసిపి నర్సింగరావు అక్రమాలకు అడ్డు లేకుండాపోయింది డిప్యూటీ కమిషనర్‌ దశరథ్‌ కు, జోనల్‌ కమిషనర్‌ శంకరయ్యకు మామూళ్లు అప్పజెప్పి దర్జాగా అక్రమా లకు పాల్పడుతున్నాడు. ప్రతిరోజు లక్షల లో వసూలు చెయ్యంది ఏసిపి ఇంటికి వెళ్ళాడు. ఈ వాస్తవాలను మున్సిపల్‌ సిబ్బంది చెప్పడం గమనార్హం. ఏసిపి నర్సింగరావు అక్రమాలకు మారు పేరుగా మారి మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో లక్షలు వసూలు చేస్తూ నిర్మాణదారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం పరిపా టిగా మారింది. అక్ర మకు రారాజు మారిన ఎసిపి నర్సింగ్‌ రావు విజిలెన్స్‌ అధికారుల కు సైతం నెల నెల మామూళ్ల ను అందిం చడం వల్లనే వారు కూడా చూసిచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరో పణలు కూడా ఉన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గం లో అక్రమ నిర్మాణాలపై వసూలు చేస్తున్నారని నేనొక్కడినే కాదని స్థానిక కార్పొరేటర్లు రాజకీయ నాయకులు ఉన్నారని అని ఏసీపీ బహిర్గ తంగానే వెల్లడిస్తున్నాడు. ఏది ఏమైనా మల్కాజిగిరి సర్కిల్‌ కేడిల కు కేరాఫ్‌గా మారింది. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి కమిషనర్‌, సీసీ పీ స్పందించి అక్రమ నిర్మాణాలను అదుపు చేస్తారో లేక నాకు వాట నాకు కావాలని వేచి చూస్తారొ..?

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close