నేడే విడుదల అభిన(వ) oదన్‌

0

ఎట్టకేలకు ఓ సైనికుడు యావత్త్‌ పాకిస్థాన్‌ను ఒక్కరోజులోనే గడగడలాడించాడు. మనో నిబ్బరంతో మాట్లాడిన ఆ వీరసైనికుడి ధైర్యానికి ప్రపంచం వీస్తుపోయింది. ఆ వీర జవాను కోసం దేశాధ్యక్షులు రంగంలోకి దిగి ఎట్టకేలకు పాక్‌తో భారత ఫైలెట్‌ విడుదల విషయం చెప్పించారు. దటీజ్‌ మన వీరజవాన్‌ అభినందన్‌కు అభివందనం.

ఇస్లామాబాద్‌: భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్‌ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో భారత్‌ పైచేయి సాధించింది. విక్రమ్‌ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, కుదరలేదని పేర్కొన్నారు.  శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

ఎలాంటి ఓప్పందం ల్లేదు: భారత్‌… పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను విడిపించుకోవడానికి పాకిస్తాన్‌ తో ఎలాంటి ఒప్పందం? చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్‌, పాక్‌పై ఒత్తిడి తెచ్చింది.అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించి గాయపడిన జవాన్‌ను వీడియోలో చిత్రీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాకిస్తాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌ షాను పిలిపించుకున్న విదేశాంగశాఖ తమ నిరసనను తెలిపింది. జాతీయ భద్రతా విషయంలో కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనకాడ బోమని తేల్చి చెప్పింది. అభినందన్‌ విడుదల విషయంలో పాక్‌తో ఎలాంటి చర్చలు కానీ, ఒప్పందాలు కానీ ఉండబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అభినందన్‌ విషయంలో కాందహర్‌ విమానం హైజాక్‌ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఏమీ ఉండవని తెలిపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here