ఓ రాజకీయ నాయకుల్లారా..!
ఓట్ల పండుగొస్తేనే మా ఇండ్లజాడలు
గుర్తొస్తయి కదా..
మా ఇంటి గడుపలో కూసోని
మూల్గుతున్న ముసలవ్వనైన
ముద్దాడిపోతిరి కదా
వగలమారి ప్రేమనొలకబోసి..
గెలిచినంక ఎన్నిసార్లు
మీ కొంపలకు వచ్చిపోయామో,
ఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితిరా..
ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలు
గెలిచినంక కూడా ఉండాలే..
మా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారు..
ఇకనైనా తెలుసుకో జెరబుర్రబెట్టి…
- కనకమామిడి సన్నీ