FeaturedUncategorized

రూ.150 కోట్ల ఎన్నికల విరాళాల పంచాయతీలో ‘మెఘా’ అరెస్ట్‌ ఖాయం..?

? కాంగ్రెస్‌ కు ఐటీ శాఖ నోటీసులు

? కాంట్రాక్టుల వెనుక దాగిన నిజాలు

? నాటి 5గురి ముఖ్యమంత్రులకు సైతం…

? దేశాన్ని కుదపనున్న ‘ఎలక్షన్‌ స్కాం’

? ముందే చెప్పిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’

(పరిశోధన: అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో… ఎన్నికల సరళిని అపహాస్యం చేస్తూ ఓట్లను కాదు. 130 కోట్ల మందిని నిర్ఘాంతపోయేలా.. నిశ్చేష్టులను చేస్తూ… నిసిగ్గుగా.. నిర్లజ్జగా.. నిరాటంకంగా..ఏకంగా ఎంపీలను గంప గుత్తాగా కొనే ప్రక్రియ. ఈ పంపిణీలో నాటి ఐదుగురు ముఖ్యమంత్రులకు సైతం ‘తిలా పాపం తలా వందకోట్ల’ చందాన ‘చందాల రూపం’లో మేశారు. ఒకడు మేపాడు.

ఈ ఉదంతంలో…10 దేశాలతో పాటు మన దేశంలోని 17 రాష్ట్రాలలో కాంట్రాక్టు పనులు చేసే ‘మెఘా’ కృష్ణారెడ్డి అలియాస్‌ పివీ కృష్ణారెడ్డి త్వరలో అరెస్ట్‌ కావడం ఖాయమని తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా స్తబ్దతగా ఉన్న ఆదాయపన్ను కేసులో.. ఇటీవల వేగంగా మారుతున్న పరిణామాలు ఆయన అరెస్ట్‌ కానున్నారనే విషయం చెప్పకనే చెపుతున్నాయి. ఆయన కూడా అందుకు మానసికంగా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయపు పన్ను దాడులలో ఏకంగా3,300కోట్ల అక్రమ.లావాదేవీల విషయం వెలుగుచూసింది. కాంగ్రెస్‌ పార్టీకి కూడా నిధులు విరాళాల రూపంలో అందాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మాకు ఎలాంటి భేషజాలు ల్లేవ్‌. ఉండవ్‌. ఉన్నది ఉన్నట్లు ‘కొండను బద్దలు కొట్టి.. నిజాలను నిర్భయంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా చెప్పటమే మా లక్ష్యం’. లక్ష కోట్లపైన టర్నోవర్‌ కలిగి, ‘కాంట్రాక్టు పాగా’ వేసిన ‘మెఘా’ కంపెనీ పేరు తొలిసారిగా… నేరుగా.. ధైర్యంగా.. ప్రకటిస్తున్నాం. ఉద్యమాల తెలంగాణ కేంద్రంగా ఆర్థిక ఊచకోత జరిగిందంటూ.. ఈ ఏడాది అక్టోబర్‌ 23న ”మెఘా నోట వచ్చిన ఆ సిఎంలు ఎవరు..?, నవంబర్‌ 14న ”ఆ రూ. 150కోట్ల ఆంధ్రండు ఎవరు..?”, నవంబర్‌ 23న ”ఉచ్చు బిగుస్తోంది ఎవరికి..?” అంటూ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ముచ్చటగా మూడు సంచలన కథనాలు వెలువరించింది.

‘మెఘా’ ఎలా ఎ’దిగారు’. డబ్బు సంపాదించడం కోసం ఆయన ఏం చేశారు.? తాజా సంఘటనలు వాటికి కొనసాగింపుగా ఈ తెగనాడే, తెగించే పరిశోధన కథనాలు వెలువరిస్తున్నాం. తాజాగా ఏం జరుగుతుంది..? అనే కోణాలను… ‘జర్నలిజం’ అంటే తక్కువగా చూసే వీళ్ళ ఖరీదైన బతుకులను కొంచెం గట్టిగానే ‘టచ్‌’ చేయాలనే..నిజాలను నిర్భయంగా ఆధారాలతో అందిస్తున్నాం.

ఇలా పొక్కింది..:

పన్ను ఎగవేతకు పాల్పడిన ‘మెఘా’ కంపెనీ నుంచి విరాళాలు స్వీకరించిన వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.3,300 కోట్ల హవాలా అక్రమాలు జరిగినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ అక్రమ లావాదేవీలకు

పాల్పడిన కంపెనీలలో హైదరాబాద్కు చెందిన ‘మెఘా’సంస్థ ఉంది. ఈ కంపెనీ నుంచి కాంగ్రెస్‌ కు రూ.150కోట్ల పై చిలుకు వరకు విరాళాలు స్వీకరించింది. (‘ఎందుకు స్వీకరించింది’ అనేది తర్వాత కథనాలలో చెప్పుకుందాం.) దీనిపై సమాధానం చెప్పాలని ఏఐసీసీకి ఐటి శాఖ తాఖీదులు కూడా పంపింది. గత నెల ఆదాయపు పన్నుశాఖ ‘మెఘా’పై జరిపిన దాడుల్లో ఆయన ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ చెపుతోంది.(డోంట్‌ వర్రీ..పక్కా ఆధారాలు మా పక్కనే ఉన్నాయి.) దీంతో ఈ కంపెనీల వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలో 42 చోట్ల ఐటీ శాఖ ఈ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో సదరు సంస్థలు బోగస్‌ ఒప్పందాల్లో రూ.3,300 కోట్ల మేర హవాలా అక్రమాలకు పాల్పడినట్లు తేలినట్లు ఐటీశాఖ పేర్కొంది.

పైపులు పట్టుకొని ఎగబాకి ఎ’దిగారు’:

1989లో చిన్న సంస్థగా ప్రారంభమైన ‘మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌’ ప్రస్థానం ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ తో ఒక దిగ్గజంగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్‌ చైర్మన్‌ పీపీరెడ్డి 1989లో సిమెంట్‌ పైపులు తయారు చేసే సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పీవీ కృష్ణారెడ్డి వచ్చి చేరాడు. దాంతో ఆయన సహజ ఎత్తుగడలతో ఎంఇఐఎల్‌ రూపురేఖలే మార్చివేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రాజెక్టులను ‘మెఘా’ పూర్తి చేసింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో కూడా తమ సత్తా చూపింది మేఘా.

భగీరథ.. కాళేశ్వరం.. డౌటనుమానాలు:

భగీరథ విషయంలో రూ.43,500 కోట్లు, కాళేశ్వరం విషయంలో 1లక్షా, 20వేల కోట్ల కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. 2016లో కేవలం 30 వేల కోట్లతో పూర్తి కావల్సిన ప్రోజెక్ట్‌ వ్యయం ముందు 80వేల కోట్లకు, ఆ తర్వాత లక్షా 12వేలకు పెంచినట్లు కేంద్రానికి అందిన ఫిర్యాదులో ఉంది. ఇందులో గులాబీ నేతలకు 40% ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

‘మెఘా’ అరెస్ట్‌ ఎందుకు..?:

ఐటి శాఖ అధికారులు గుర్తించిన 3,300కోట్ల రూపాయల బాగోతంలో సింహ భాగం ఈ ఆయన గారిదే కావడం గమనార్హం. అందుకే ముందు ‘మెఘా’ నుంచి కథ మొదలెట్టి… నెమ్మది, నెమ్మదిగా అందర్నీ తమ ఖాతాలోకి లాగేసుకుంటుంది ఐటీ శాఖ. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆయన దేశంలోని అన్ని పార్టీల వారికి ఏం చక్కా కోట్లాది రూపాయల చందాలు సరదాగా పంచేశారు.

ఃూచీ:

ఎన్నో ప్రశ్నలకు ‘ఆదాబ్‌’ పరిశోధన సమాధానం

కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.3,300 కోట్ల రూపాయల ‘లిక్విడ్‌ క్యాష్‌’ ఎలా ఎన్నికల సందర్భంగా హఠాత్తుగా వచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు మల్లగుల్లాలు.. పాత పదం.. ‘గుల్లమాల్లాలు’ పడుతున్నారు. ఆ విషయాలు గమనించండి.

? ఆ రూ.3,300కోట్ల నగదు ఎక్కడ..?

? ఏవిధంగా బ్లాక్‌ చేశారు..?

? ఎక్కడ బ్లాక్‌ చేశొరు..?

? ఎలా బ్లొక్‌ చేశారు..?

? అంత ‘లిక్విడ్‌’ క్యాష్‌ ను బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా ధైర్యంగా ఎలా పంపగలిగారు..?

? ఇది ‘ఎకౌంటబులిటీ’ అని తెలిసి ఎందుకు తెగించారు..?

? ఆ నగదు ఎవరికి పంపారు… ?

? ఏ పార్టీ వారికి పంపారు..?

? ఎంత పంపారు..?

? ఒకవేళ అది కాస్తా బయటపడితే… ఈ దౌర్భాగ్యులను కాపాడే నాయకుడు ఎవరు..?

? ఆ నాయకుడు ఏ స్థాయిలో ఉండాలి..?

? ఆయనకు కేంద్రంలో దక్కే పదవి కోసమేనా ఈ చెల్లింపులు…?

? ఇందులో ఇరుక్కున్న రాజకీయులు ఎవరు..?

? వారి రాజకీయ ప్రస్థానం ఏమిటి..?

? ఏ ప్రలోభం కోసం ఇది జరిగింది..?

? ఎవరి ప్రాపకం కోసం ఇది జరిగింది..?

? ఓ జ్యోతిష్కుడి జాతకం నమ్మిన ఆ మూర్ఖపు నాయకుడు ఎవడు…?

? ఒళ్ళు జలదరించే ఇలాంటి విషయాలను ధైర్యంగా బయటపెట్టే దమ్ముంది ఎవరికి ఉంది..?

ఆలోచించడానికే ఒకింత మృత్యువు కన్పించే దశ దిశలో.. ‘పిల్లి మెడలో డోలు కట్టి’ పక్కాగా లెక్కలు చూపించి వాయించడానికి ‘ఆదాబ్‌’ రెడీగా ఉంది. ఎన్నో విషయాలను ధైర్యంగా బ్రేక్‌ చేసిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వరుస కథనాల ద్వారా మరికొన్ని భయంకరమైన నిజాలు రేపటి నుంచి బయటపెడుతుంది. వేచి చూడండి ఒకింత ధైర్యంగా.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close