Featuredజాతీయ వార్తలు

కలాంకు ఘనంగా నివాళి అర్పించిన జాతి

ట్విట్టర్‌ వేదికగా స్మృతులను నెమరేసుకున్న మోడీ

న్యూఢిల్లీ

దివంగత భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని మోడీ అన్నారు.
కలాం జ జయంతి సందర్భంగా ప్రధాని.. కలాం జ్ఞాపకాలను ట్విట్టర్‌ ద్వారా నెమరువేసుకున్నారు. రక్షణ రంగంలో కలాం చేసిన కృషి ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు ఆదర్శనీయం. ఎంత ఉన్నతమైన స్థానాలు అధిరోహించి నప్పటికీ.. ఆయన సాధారణ జీవితం గడిపారనీ, వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేరని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. పుస్తకాలే ఆయన ఆస్తి అని మోడీ అన్నారు. ఆయనను కలుసుకున్న క్షణాలు నా మనసులో ఇప్పటికీ
పదిలంగా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. భారత్‌ రక్షణరంగంలో బలపడడానికి ప్రధాన వ్యక్తి కలాం అని ఈ సందర్భంగా ప్రధాని
అన్నారు.

అబ్దుల్‌ కలాంకు డీఆర్‌డీవో నివాళి మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్బంగా ఢిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఎయిర్‌ చీఫ్‌ భదౌరియా,నేవీ చీఫ్‌ కరంబీర్‌ సింగ్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డిలు.. కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా 41వ డీఆర్‌డీవో డైరక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. కొత్త టెక్నాలజీని ఆశ్రయించాల్సి అవసరం ఉందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ తెలిపారు. అమెరికాలో ఉన్నటువంటి డర్పా లాంటి మోడళ్లను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
చిన్న తరహా ఆవిష్కర్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నేవీ చీఫ్‌ చెప్పారు. స్వదేశీ పరిజ్‌క్షానంతో తయారైన ఆయుధాలతో యుద్ధం చేసి గెలుస్తామని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సైబర్‌, స్పేస్‌, లేజర్‌, ఎలక్టాన్రిక్‌, రోబోటిక్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలని బిపిన్‌ రావత్‌ చెప్పారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close