తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

0

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట్టై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా మెదక్‌ జిల్లాకు చెందినవా రుగా గుర్తించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలం కాజీపేట గ్రామానికి చెందిన 18 మంది అయ్యప్పభక్తులు శబరిమల నుండి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధురైకు సవిూపంలోని పుదుకొట్టై సవిూపంలో ఆదివారం నాడు అయ్యప్ప భక్తులు ప్రయాణీస్తున్న టెంపో ట్రాక్స్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం లో మహేష్‌,కుమార్‌, నాగరాజు, శ్యామ్‌, ప్రవీణ్‌, కృష్ణ, సాయి,. ఆంజనేయులు, సురేష్‌ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగి సొంత ఊరికి వెళ్తుండగా.. రామేశ్వరం-తిరుచ్చి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్‌ రాంగ్‌ రూట్‌లో ఒక్కసారిగా రోడ్డుపై రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ భాస్కర్‌ క్షతగాత్రులు చికిత్సపొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కాజీపేటతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కూడ ఏడుగురు కూడ ఈ వాహనంలో ఉన్నారని చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీకి అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here