అవినీతి రహిత సమాజమే లక్ష్యం

0
  • ఎక్కడో ఓ చోట అడుగు పడాల్సిందే
  • సీఎం కేసీఆర్‌ ప్రకటనతో గ్రామాల్లో చైతన్యం
  • ఉద్యోగుల్లో మాత్రం తప్పని ఆందోళన
  • కొత్త చట్టంపై ఇక ప్రజల్లో విస్తృతంగా చర్చకు అవకాశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతిని అంతమొందించాలని, దీనికోసం వ్యవస్థలను ప్రక్షాళనచేయాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కఠినంగా వ్యవహరించేందుకు ఉద్యుక్తులు అవుతున్న వేళ రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఓటేసిన పాపానికి ఇన్నాళ్లూ అనేక బాధలు అనుభవించిన వారికి ఇప్పుడు ఎడారిలో ఒయాసిస్సులా కేసీఆర్‌ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ తీసుకుని రావాలనుకుంటున్న మార్పులు, ప్రక్షాళనలపై ప్రజామోదం నూటికి నూరుపసాళ్లు ఉంటుంది. ప్రజలు అవినీతి రహిత సమాజాన్ని కోరకుంటున్నారు,. ఉద్యోగ, రాజకీయ అవినతీకి ఎక్కడో ఓ దగ్గర చెక్‌ పడాల్సింది. అవినీతిపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న వేళ వీటన్నింటికీ పరిష్కారంగా రెవెన్యూ, మున్సిపల్‌కు కొత్త చట్టాలు తీసుకురానున్నామని కేసీఆర్‌ తెలిపారు. నిజానికి రూపాయి ఖర్చులేకుండా ఎమ్మార్వో ఆఫీసులో పని జరగదు. ఫైలు కదలదు. ఉద్యోగులంతా తాము దైవపుత్రులమన్న అహంభావనలో ఉన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు పొందుతున్నామన్న ఇంగితం కూడా లేకుండా ప్రజల పనుల కోసం నియమితులైన వీరు ప్రజలనే డబ్బుల కోసం పీడిస్తున్నారు. అక్రమాలకు తెగిస్తున్నారు. తాజాగా సిఎం కేసీఆర్‌ బాహాటంగానే ఇప్పుడు ఉద్యోగులకు ఉచ్చు బిగించ బోతున్నారన్న విషయం ఇప్పుడు ప్రజల్లో చర్చగా మారింది. ఇది సరైన సమయమే గాకుండా.. సరైన నిర్ణయమన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల ఆమోదం కోసం త్వరలో శాసనసభా సమావేశాలు నిర్వహిస్తామని కూడా కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాల్లో మంత్రులకు సర్వాధికారాలు ఇవడ్డంతో పాటు కలెక్టర్ల వద్దనున్న నిధులను మంత్రులకు బదలాయిస్తామని చెప్పారు. జిల్లాల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో గ్రామాల్లో అభివృద్ది పనులు వేగంగా సాగనున్నాయి. ఇప్పుడు ప్రజలకు అవినీతి పెద్ద సమస్యగా ఉందని గుర్తించి దానిని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. వచ్చే రెవెన్యూ చట్టం పటిష్ఠంగా ఉంటుంది. ఉద్యోగులు ధర్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదు. పురపాలక చట్టం కూడా ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఒక్క రూపాయి ఇవ్వకుండా పని జరగాలన్న సంకల్పాన్ని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులు మనతో కలిసి నడవడంతో అందుకు ప్రతిగా, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు పెంచాం. ఇప్పుడు వారికి కొంత అసంతృప్తి ఉంది. పీఆర్సీ, మధ్యంతర భృతి వంటివి కావాలంటున్నారు. ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల అవసరాలు కూడా చూడాలి. మేం చెప్పిందే చేయాలంటూ ప్రభుత్వం విూద పెత్తనం చేయాలనుకోవద్దని, వారు ప్రజల బాగు కోరాలని సుతిమెత్తగా కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోందని.. ఉద్యోగులు నీతినిజాయతీతో పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు నిస్వార్థ సేవలంది స్తున్నారని ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే పాలనకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ముందున్న తెలంగాణ అవినీతి లేని రాష్ట్రంగా మారాలని ఆకాంక్షించారు. లంచాలతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలను పూర్తిగా తొలగించేందుకే రెవెన్యూ, పురపాలక శాఖలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్త చట్టాలు తెస్తున్నామని చెప్పారు. చట్టాల్లో మార్పుల గురించి ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం చేస్తోంది బాగుందని ప్రజలు అనుకోవాలని, ఇందుకోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఎవరినైనా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో నియమిస్తే ఏదో సంఘంలో చేరాలనుకుంటున్నారు. ఏదైనా తప్పు చేస్తే సంఘం కాపాడుతుందనే భావన వారిలో ఏర్పడింది. ఇలా జరగకూడదని, కొత్తగా నియమించిన పంచాయతీ కార్యదర్శులకు నిబంధనలు విధించాం. మూడేళ్ల పాటు వారు ఏ సంఘంలోనూ చేరకూడదు. పనితీరు చూసి వారిని క్రమబద్దీకరిస్తామని చెప్పాం. ఇకపై ఎవరైనా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఏవోలు సస్పెండ్‌ అయితే దానిని ఎత్తివేయాలని మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ సిఫార్సు చేయరాదని గట్టిగా సూచించారు. ప్రజలు మనలను భారీ మెజారిటీతో గెలిపించారు. వారికి మనం జవాబుదారిగా ఉండాలనే కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతున్నామని అన్నారు. విస్తృతస్థాయి సమావేశాల్లో కేసీఆర్‌ ప్రసంగం ఇప్పుడు గ్రామాల్లో చర్చగా మారింది. ప్రజలంతా కేసీఆర్‌ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అవినీతిరహిత సమాజం రావాలని కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here