Featuredటెక్నాలజీస్టేట్ న్యూస్

మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం

రూటు మారి ప్రయాణించిన మెట్రో

  • లక్డీకపూల్‌ వద్ద రైలు మళ్లింపు
  • ఆ సమయంలో 400 మందిప్రయాణీకులు
  • ఎదురుగా మరో మెట్రో రాకపోవటంతో తప్పిన ప్రమాదం
  • ట్రాక్‌ మారి ప్రయాణం చేసిందనడం సరికాదు
  • ప్రమాద వార్తను ఖండించిన మెట్రో రైలు ఎండీ
  • సాంకేతిక కారణాలతోనే మెట్రోలను నిలిపివేశాం

హైదరాబాద్‌, జులై27(ఆర్‌ఎన్‌ఎ) : మెట్రోరైలుకు పెనుప్రమాదం తప్పింది. ఒక ట్రాక్‌లో వెళ్లాల్సిన మెట్రో ట్రైన్‌.. మరో ట్రాక్‌లోకి వెళ్లింది. వెంటనే తప్పిదాన్ని గుర్తించిన మెట్రో అధికారులు.. లక్డీకాపూల్‌లో రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. ట్రెయిన్‌లో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. రైలును సకాలంలో నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిన్లటైంది. దీంతో అధికారులతో పాటు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్‌ తప్పిన మెట్రో రైలు మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వెళ్తోంది. జరిగిన తప్పిదాన్ని అధికారులు సకాలంలో గుర్తించకపోయుంటే భారీ నష్టం జరిగి ఉండేది. గతంలోనూ ఒకసారి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మెట్రో ట్రైన్‌ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయంలో అధికారులు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ట్రైన్‌ ముందుకు కదిలింది.

మెట్రో రైలుపై పుకార్లు సరికాదు : ఎండి

హైదరాబాద్‌ మెట్రో రైలు మరో ట్రాక్‌లో వెళ్లడంతో ప్రమాదం తప్పిందంటూ వస్తున్న వార్తల్ని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఖండించారు. అలాంటి వార్తలన్నీ అవాస్తవమన్నారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా వదంతులు వ్యాప్తి చేయొద్దని ఆయన కోరారు. ప్రధానంగా సోషల్‌ విూడియా ద్వారా ఇలాంటి వ్యాప్తులు జరిగాయన్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గాలుల ధాటికి ట్రాక్‌కు అడ్డంగా ఓ రాడ్‌ పడిపోవడంతో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్‌ దాటి లక్డికాపూల్‌ వద్దకు రాగానే నిలిపివేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పైన ఉన్న బ్యాటరీ పవర్‌తో రైలును రివర్స్‌ తీసుకెళ్లి మళ్లీ అసెంబ్లీ స్టేషన్‌ వద్ద నిలిపారు. లక్డికాపూల్‌ స్టేషన్‌కు ముందు రైలు ఆగిపోగా.. అందులో ఓ ఆస్తమా పేషెంట్‌ ఉండటంతో బ్యాటరీ పవర్‌తో ఆ రైలును వెనక్కి తీసుకెళ్లి అసెంబ్లీ స్టేషన్‌ వద్ద ఆపారు. దీనిపై సోషల్‌ విూడియాలో మెట్రో రైలుకు తప్పిన ముప్పు అంటూ వదంతులు వ్యాపించడంతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. రైలు ఆగినప్పటి నుంచి తాము సమన్వయం చేస్తూనే ఉన్నామన్నారు. అదే ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చే రైలు సిబ్బందితో సమన్వయం చేసి దాన్ని ముందే నిలిపివేశామని.. ఆ తర్వాతే ఈ రైలును వెనక్కి పంపినట్టు ఆయన వివరించారు. రైలులో ఆస్తమా పేషెంట్‌ ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో ఈ రైలును వెనక్కి పంపామన్నారు. ఆ తర్వాత ట్రాక్‌పై పడిన రాడ్‌ను తక్షణమే తొలగించి రైలు సేవల్ని యథాతథంగా కొనసాగించినట్టు తెలిపారు. దీంతో సుమారు అర్ధగంట పాటు రైలు సేవలకు అంతరాయం కలిగిందని తెలిపారు.ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు స్వల్ప భయాందోళన గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొందరు సోషల్‌ విూడియాలో వీడియోలు పోస్ట్‌ చేయడంతో ఈ వదంతులు చెలరేగాయి. ప్రస్తుతానికి రెండు మార్గాల్లోనూ మెట్రో రైలు సేవలు సాఫీగా సాగుతున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close