Featuredస్టేట్ న్యూస్

దొరసాని ఇంట్లో పనిమనిషికి… రూ : 54 వేల ప్రభుత్వ వేతనం!

స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ ఆండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ శేషు కుమారి నిర్వాహకము.

రూ : 5 వేలకు పనిచేసే పని మనిషికి రూ : 54,418 వేల వేతనంగా ప్రజల సొమ్ము చెల్లింపు.

బోరబండ గురుకుల పాఠశాలలో వంట మనిషి అయినా రంగమ్మ పోస్టును అటెండర్‌గా మార్పు.


2017 సంవత్సరంలో బదిలీ అయినా ప్రభుత్వ ఉద్యోగి రంగమ్మ విధులు దొరసాని ఇంట్లోనే.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రెటరీగా 2013 నుండి 2017 వ సంవత్సరం వరకు సెక్రటరీగా విధులను నిర్వహించిన శేషు కుమారి తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డు పెట్టుకొని బోరబండ రెసిడెన్షియల్‌ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న రంగమ్మ ను తన ఇంట్లో పని చేయించుకోవడానికి తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి కుక్‌ పోస్ట్‌ ను అటెం డర్‌ గా మార్చి నాంపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకే షనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ సొసైటీలో 2017 వ సంవత్సరం మే 3వ తేదీన బదిలీ చేయించుకున్నారు. 2017 మే 3 వ తేది నుంచి ఈ రోజు వరకు తన ఇంట్లో పని మనిషిగా పని చేయించుకుం టున్నారు. 2017 సంవత్సరంలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ ఆండ్‌ ట్రైనింగ్‌ (ూ్‌a్‌వ జశీబఅషఱశ్రీ శీట జుసబషa్‌ఱశీఅaశ్రీ =వరవaతీషష్ట్ర aఅస ుతీaఱఅఱఅస్త్ర) డైరెక్టర్‌ గా బదిలీ అయిన అనంతరం సొసైటీ సెక్రటరీగా పదవీ బాధ్యతలు సత్యనారాయణ రెడ్డి స్వీకరిం చారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా రంగమ్మ నెల వారి జీతము 54,418 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది, శేషు కుమారి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న విష యం సొసైటీ సెక్రెటరీ సత్యనా రాయణ రెడ్డికి తెలిసినా చర్య లు చేపట్టక పోవడం శోచనీ యం. శేషు కుమారి సొసైటీ సెక్రటరీగా విధులను నిర్వహి స్తూ తన అధికా రాన్ని అడ్డుపె ట్టుకొని ప్రభుత్వ ఉద్యోగి తో ఇంట్లో పని చేయించుకుం టున్నారు అన్న విష యం సత్య నారాయణ రెడ్డి కి తెలిసి, శేషు కు మారి పై ఉన్నతా ధికారులకు రిపోర్టు అందచేయవలసిన బాధ్య తలను మరచి యధావిధిగా రంగమ్మ ను శేషు కుమారి ఇంట్లో పని చేయడానికి అనుమతిం చడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శేషు కుమారికి అండగా నిలిచిన సత్యనారాయణ రెడ్డి

ఉన్నత విలువ లతో సమాజానికి, విద్యా ర్థులకు ఆదర్శవంతంగా ఉండవ లసిన అధికారులు దుర్బుద్ధితో, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారాన్ని దుర్విని యోగం చేస్తూ లక్షలాది రూపా యలు ప్రభుత్వ ధనానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిం చడం ఆశ్చ ర్యకరం. ఇంట్లో పని చేయడానికి 5 వేల రూపా యలు అందజేస్తే పని మనుషులు వస్తారు. కానీ 54 వేల రూపాయలు ప్రభుత్వం నుండి జీతం పొందు తున్న అటెండర్‌ని పని మనిషిగా చేయిం చుకున్న ఘనత శేషు కుమారికి, అందుకు సహకరిం చిన సత్యనారాయణ రెడ్డి చెం దుతుంది. ఇలాంటి బాధ్యత లేని అధికారులపై ప్రభుత్వ ఉన్నతా ధికారులు స్పందించి వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం చెల్లించిన 32 నెలల జీతం మొత్తాన్ని వారి నుండి రికవరీ చేయవలసిందిగా సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

అటెండర్‌ రంగమ్మ : పెద్ద సార్లు ఎక్కడ పని చేయమంటే అక్కడ చేయాలి కదా సారు, గరీబోళ్ళం చెప్పేది వినాలి,మేము ఏమి చేయగలం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close