Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

విధుల గౌర్హాజర్ పట్ల కలెక్టర్ సీరియస్మహబూబాబాద్(ఆదాబ్ హైదరాబాద్). జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య గురువారం బయ్యారం మండలం లోని గంధంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రిలో అందుబాటు లేకపోవడంపై కలెక్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అంబరీష్ ను ఫోన్లో అడగగా డాక్టర్కు జ్వరం వస్తున్నందున విధులకు హాజరు కాలేదని సమాధానం ఇవ్వగా, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా డాక్టర్లు ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నెలరోజుల పాటు సేలవులను రద్దు చేసిందని అన్నారు. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులను డుమ్మా కొట్టి నిర్లక్ష్యం వహీంచి  గార్లలో తన స్వంత క్లినిక్లో పేషెంట్లను చూస్తూన్నాడని కలెక్టర్ దృష్టికి రాగా, మెడికల్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అదేవిధంగా డెప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష్ పర్యవేక్షణ లోపం జరిగినందున అతనికి ప్రభుత్వానికి సరెండర్ చేయవలసిందిగా కలెక్టర్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పి హెచ్ సి లో రోగులకు ఇచ్చే మందులను ఈ ఔషధీ ద్వారా ఫార్మసిస్ట్ రోగులకు  మందుల ఇవ్వకుండా, రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫార్మసీస్ట్ గంగారంను సస్పెండ్ చేయాల్సిందిగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలోని హాజరు పట్టిక, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. , ఆసుపత్రిలో రోగులను పరామర్శించి అందిస్తున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని తెలుపుతూ పీహెచ్సీ పరిధిలో ఆగస్టు నెలలో ఇంతమంది గర్భవతులు, ఈ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు అనే వివరాలు రికార్డులలో పరిశీలించగా ఆగస్టు నెలలో 22 గర్భవతులకు గాను కేవలం ఎనిమిది మంది ప్రసవం ఈ పిహెచ్ సి లో జరిగిందని నర్సులు తెలపగా, 14 మంది ఈ ఆస్పత్రుల్లో ఏ డాక్టర్ వద్ద ప్రసవం జరిగిందో వివరాలు రిజిస్టర్లో నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాస్థాయిలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఆదేశించినప్పటికీ అవి అమలు జరుగాకపోవడం శోచనీయమని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సక్రమంగా రికార్డులు రాయకపోవడం పై నర్స హైమావతి ను తాఖీదులు జారీ చేయాలని ఆదేశించారు.అనంతరం బయ్యారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మండలంలో అమలుపై సమీక్షించారు. మండలంలోని 29 గ్రామాలకుగానూ 15 గ్రామాలలో డంపింగ్ యార్డ్, క్రిమిటోరియా, నర్సరీలకు స్థలాన్ని గుర్తించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ కలెక్టర్ కు వివరించారు. స్థలాలు గుర్తించిన వాటికి ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరు చేయించుకుని అట్టి వివరాలను ఆన్లైన్లో వెంటనే పరచాలన్నారు. అదేవిధంగా మిగిలిన గ్రామపంచాయతీలో వెంటనే స్థలాన్ని గుర్తించాలని, ప్రభుత్వ స్థలం లేకుంటే దాతల నుండి భూమి సేకరించాలని లేదా గ్రామ పంచాయతీల నిధుల నుండి కొనుగోలు చేయాలని ఆదేశించారు. మండలంలో ప్రత్యేక కార్యక్రమం ఆశాజనకంగా లేదని ప్రజలను అధిక సంఖ్యలో భాగస్వామ్యులు చేస్తూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, బయ్యారం మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ ఎంపీడీవో, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close