Featuredస్టేట్ న్యూస్

స్వచ్ఛంద స్వాహాలో మతం మాటున మోసగాడు

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏ ఆపద వచ్చినా…కులం, మతం తేడా లేకుండా అందరూ దేవుడికే మొక్కుతారు. ఆయన ఆస్తులకు ఎవరు, ఏవిధంగా ఎసరు పెట్టినా ఆ దేవుడు ఎలాగో మాట్లాడలేడు. అందుకే ఆయన ఆస్తులపై ఒకనాటి అనామకుడు… నేటి మత పెద్ద కన్నేశాడు. దైవదూత సాక్షిగా కాజేశాడు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో అక్షరాల 524 కోట్లు. మతం మాటున ఐదు రాష్ట్రాలకు విస్తరించిన ఆయన అక్రమాలు తవ్వకుండానే వెలుగుచూస్తున్నాయి. రాజకీయ నాయకులతో అయనకున్న సంబంధాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోర్జరీ పత్రాలను సృష్టించి దేవుడిభూములను నిశ్శబ్దంగా అమ్మేశాడు. విదేశీ విరాళాల స్వాహాలో ఈయనదొక పర్వం. ఎవరినైనా మేనేజ్‌ చేస్తాననే గుడ్డి నమ్మకం. ‘ఆదాబ్‌’ బృందానికి

ఢబ్బు ఎరగా చూపారు. బెదిరింపులకు దిగారు.. ఆయన మధ్యవర్తులు పాపం. అతగాడు చేసిన దానికి ఆదాబ్‌ బృందం ఆయన బతుకు ఉగ్గుపాలతో బయటపెడుతోంది. ఆయనే ద గ్రేట్‌… ‘చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ మాజీ బిషప్‌ గోవాడ దైవ ఆశీర్వాదం.

ఇదీ పథకం: దైవ ఆశీర్వాదం మతంలో ఉన్న ఆర్థిక కోణం కనిపెట్టారు. ఆయన చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ( సీఎస్‌ఐ) పరిధి గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉంది. దీన్ని కృష్ణా, గోదావరి డయాస్‌ గా అని పిలుస్తారు. ఈ డయాస్‌ మొత్తానికి బిష్ప్‌ గా దైవ ఆశీర్వాదం వ్యవహరించారు. డయోస్‌ పరిధిలో 300 చర్చిలున్నాయి. వాటికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక్క విజయవాడలోనే రూ.2 వేల కోట్ల ఆస్తులున్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి మొత్తం 402 వరకు డాక్యుమెంట్లు ఉండాలి. వాటిలో 294 మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన డాక్యుమెంట్ల గురించి ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఎస్‌ఐకి సంబంధించిన ఎలాంటి ఆస్తిని విక్రయించాలన్నా, కొత్తగా కొనుగోలు చేయాలన్నా చెన్నైలోని సీఎస్‌ఐ మత పెద్ద అనుమతి ఉండాలి.

నకిలీ పత్రాల సృష్టి కర్త: ఆస్తుల అమ్మకానికి అవసరమైన అనుమతికి నకిలీ లేఖలను ఆయన సృష్టించారు. ఈ నకిలీ లేఖల ఆధారంగా విలువైన ఆస్తులను విక్రయించేశాడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఈ భూ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది.

‘భూ’ మాయ కథ: ఆయన పదవీకాలంలో పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో 5 ఎకరాల భూమిని రూ.26 కోట్లకు విక్రయించారు. దాన్ని రూ.4 కోట్లకు విక్రయించానని చెన్నైలోని తమ పై సంఘానికి నివేదిక సమర్పించారు. ఆ డబ్బులతో మరోచోట విలువ లేని మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూములను విక్రయించేందుకుగాను దైవ ఆశీర్వాదం తన సోదరుడి కుమారుడు గోవాడ శామ్యూల్‌ సుధీర్ను ఏలూరులో ఉన్న చర్చికి కార్యదర్శిగా నియమించుకున్నారు. ఏలూరులో కొనుగోలు చేసిన భూమికి మచిలీపట్నంలో ఉన్న భూముల టైటిల్‌ డీడ్ను చూపి రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీంతోపాటు మైలవరం సవిూపంలో ఉన్న విద్యానగరంలో 40 ఎకరాల భూమిని ఓ బడా రాజకీయ నేతకు విక్రయించి, అలియా అండ్‌ అదర్స్‌ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు.

524 కోట్లు ఇలా నొక్కాడు..: ఇప్పటి వరకు రూ.100 కోట్ల దుర్వినియోగం జరిగింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో

దాదాపుగా రూ.500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కుంభకోణంలో అతనికి కార్యదర్శులుగా ఉన్న వారిలో ఇందుపల్లి సునీత దాదాపుగా రూ.50-60 లక్షల లావాదేవీలు తన పేరున చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

విదేశీ విరాళాలనూ..: రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన బాధితుల సహాయార్థం విదేశీ మిషనరీ సంస్థలు ఇచ్చిన విరాళాలు, చర్చిలకు సంఘీయులు ఇచ్చిన విరాళాలనూ దుర్వినియోగం చేసినట్టు ఆశీర్వాదంపై ఆరోపణలు ఉన్నాయి.

మోసం నిజమే: సీఎస్‌ఐ ఆస్తుల అమ్మకాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి సీఐడీ పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 6/2017తో కేసు నమోదు చేసినట్లు కృష్ణా జిల్లా అడిషినల్‌ ఎస్‌.పి సాయికృష్ణ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు స్పష్టం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close