జూన్‌ 4న జిల్లా, మండల పరిషత్‌ కౌంటింగ్‌

0

జూలై 4 తర్వాత పగ్గాలు

పంచాయితీరాజ్‌ చట్టం సవరణలు

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నిలపై ఆర్డినెన్స్‌ జారీ

జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు,మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక ఫలితాలపై ఓ స్పష్టత వచ్చింది. పంచాయితీరాజ్‌ సవరణ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. పంచాయితీ రాజ్‌ చట్టాన్ని సవరిస్తూ గవర్నర్‌ నరింహన్‌ తాజాగా తెలంగాణ పంచాయితీరాజ్‌ (సవరణ) అర్డినెన్స్‌2019 జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయినా.. కొత్తగా పదవులు చేపట్టే జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మండల అధ్యక్షులు మాత్రం జూలై4 తర్వాతనే అధికార పగ్గాలు చేపట్టనున్నారు. అప్పటి వరకు ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలంలో ఉన్నందున కొత్త వారు బాధ్యతుల చేపట్టడానికి వీలుండదు. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపిటీసీ స్థానాలకు ఈ నెల 6,10,14 తేదీలలో మూడు దశలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కానీ నేటి వరకు ఫలితాలు వెల్లడి కాలేదు. ఈ నెల 27న కౌటింగ్‌ చేపట్టి ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నా.. రాజకీయ పార్టీల అభ్యంతరాల మేరకు ఫలితాల వెల్లడి వాయిదా వేశారు. జూలై4 వరకు పాత పాలక వర్గాల పదవీ కాలం ఉన్నందున కొత్త వారు కొలువు తీరరాదని అంశంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో ఫలితాలు వాయితా వేశారు. ముందే ఫలితాలు వెల్లడిస్తే క్యాంపు రాజకీయాల ప్రభావం ఉంటుందని రాజకీయ పార్టీల అభ్యంతరాల మేరకు ఎన్నికల సంఘం ఈ ఫలితాలను వాయిదా వేసినట్లు సమాచారం.

పంచాయితీరాజ్‌ చట్టం సవరణ

తెలంగాణ పంచాయితీ రాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 147, 176ను సవరిస్తూ తెలంగాణ పంచాయితీ రాజ్‌ (సవరణ) ఆర్డినెన్స్‌2019ను జారీ చేశారు. సెక్షన్‌147లోని సబ్‌ సెక్షన్‌11ను సవరించారు. దీని ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఎంపిటీసీ సభ్యుల సమావేశం నిర్వహించి మండల పరిషత్‌ అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. సెక్షన్‌ 176 లోని సబ్‌ సెక్షన్‌9ను సవరించి జిల్లా పరిత్‌ చైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవాలి.

నాలుగు జిల్లాలపై టిఆర్‌ఎస్‌ కన్ను

ఉమ్మడి కరీంనగర్‌లో కొత్తగా ఏర్పడ్డ కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలపై టిఆర్‌ఎస్‌ కన్నేసింది. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు సంబంధించిన జబితాలను టిఆర్‌ఎస్‌ నాయకులు సిద్దం చేసుకున్నారు. అన్ని జల్లాల్లోనూ ఏకగ్రీవ ఎన్నికలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here