No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

గిరిజన ఆశ్రమ పాఠశాలలోమౌళిక వసతులు కల్పించాలి

తప్పక చదవండి

శాంతినగర్‌, రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన గిరిజన సంఘ నేతలు

కారేపల్లి : గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యల ను పరిష్కరిం చుటలో ఐటిడిఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, మండల అధ్యక్షులు అజ్మీర శోభన్‌ నాయక్‌ ఆరోపించారు. గురు వారం మండల పరిధిలో శాంతినగర్‌, రేల కాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్స్‌ పాడైపోయి మూలకు వదిలేసారని, విద్యార్థు లు మిషన్‌ భగీరథ నీళ్లు తాగలేక అవస్థలు పడుతున్నారని వెంటనే ఆర్‌ ఓ వాటర్‌ ప్లాంట్లను మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు కంపు కొడుతున్నాయని, పాడైన వాటిని బాగుచేసే నాధుడే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ సంబంధిం చిన అధికారులు వెంటనే స్పందించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్పందిం చకపోతే విద్యార్థులు తో కలిసి ఆశ్రమ పాఠశాలల ముందు ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ఆశ్రమ పాఠశాలలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు