Friday, October 18, 2024
spot_img

మీరు ఎన్నికలలో గెలవడానికి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారా..?

తప్పక చదవండి
  • అయితే తప్పకుండా ఈ క్రింది వాస్తు, తంత్రములను ప్రయతించి తీరవలసిందే..
  • ఎన్నికలలో నామినేషన్ వేసేటప్పుడు పాటించవలసిన నియమనిబంధనలు..

మనము ఏ ఏ నక్షత్రములలో నామినేషన్ వేసిన విజయమును పొందుతామో చూసుకొని అప్లికేషన్ ఫారంను నింపాలి. మనకు విజయమును చేకూర్చునటువంటి నక్షతములు ఏవనగా రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, ధనిష్ట, శతభిష, రేవతి నక్షత్రములు..

ఈ నక్షత్రములు గల రోజున దేవతాపూజలు ముగించుకొని దేవుని అనుగ్రహమును పొంది అప్లికేషన్ ఫారం ను నింపి సబ్మిట్ చేసిన శుభఫలితములను పొందవచ్చును. రాజకీయ జీవితంలో నిలదొక్కుకొని సక్సెస్ గా పదికాలాలపాటు వుండవలెననుకుంటే నాయకులు ఎప్పుడు ఉంగరము వ్రేలుకు కృత్తికా నక్షత్రము రోజున లేదా రవిపుష్యమి రోజున మాణిక్యమును ధరించాలి. గురుపుష్యమి రోజున లేదా పుష్యమి రోజున పుష్యరాగము చూపుడువ్రేలుకు ధరించాలి..

- Advertisement -

పార్టీ జెండాను నైరుతిదిశలో పెట్టుకొనిన మన విజయమునకు అడ్డుఉండదు. తప్పక విజయమును పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశలను వాస్తుకంపాస్ ద్వారా చక్కగా చూసుకొని నైరుతి దిశలో అంటే 225 డిగ్రీస్ లో ఉండేటట్లు చూసుకొని ఇంటిపైన, పార్టీ ఆఫీస్ లో జెండాను గాలిలో ఎగిరి ఉండేటట్లు ఎగురవేయాలి. పార్టీజెండా ఎక్కడ చినిగిపోయి ఉండకూడదు. ఎక్కడనైనా తట్టుకొని ఆగిపోయి ఉండకూడదు. ఇలా కాకుండా ఇతర దిశలలో జెండాను ఎగురవేసి ఉంచినట్లయితే విపరీత పరిణామములను ఎదుర్కొనవలసి వచ్చి అపజయం పాలు కావలసి వస్తుంది..

ఎన్నికలలో మీరు చేసే ప్రచార కార్యక్రమములతో పాటు ఇంటి వాస్తును సరిచేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. దీనితో పాటు తాంత్రిక అభిచార క్రియలయిన షట్ప్రయోగాలను కూడా చేసుకొనిన మీరు విజయమును పొందడానికి 100 కు 100 శాతం ప్రయత్నించినట్లవుతుంది.. ఇలా మీతరపు నుంచి 100 శాతం ప్రయత్నించిన తర్వాత మీ అదృష్టములో ఏ 1 శాతం కూడా లోపం ఉన్నట్లయితే మీరు చేసినవన్నీ
నిష్ఫలమైపోతాయి.. మీకు పితృశాపములు కానీ, గురుశాపములు కానీ, దేవతాశాపములు కానీ, వృక్ష, జంతుశాపములు కానీ ఉన్నట్లయితే మీరు చేసే ఇన్ని ప్రయత్నములు విఫలమై మీరు మరల మొదటి స్థితినే చేరుకుంటారు..

సాధారణముగా రాహుకాలం, కేతుకాలము, యమగండకాలము,
గుళికకాలములలో ఏ శుభకార్యములు చేయకూడదు. కానీ లాభ, భాగ్య, స్వస్థానములలో రాహు, కేతువులు లాభమును చేకూరుస్తారు కాబట్టి ఆ సమయములలో కార్యములు చేసిన కార్యసిద్ధి కలుగును.. మిగతాస్థానములలో రాహు, కేతువులు ఉన్నప్పుడు ఏ శుభకార్యములు చేయనే చేయకూడదు.. విజయ ప్రయత్నములు విరామము లేకుండా చేసిన యాగపుణ్యఫలమును పొంది పుణ్యార్థులమవుతాము.. దేవుని అనుగ్రహము, ఆశీర్వాదమును పొంది విజయము కలిగి విజయోత్సవములను చేసుకుంటామనుకొనవచ్చును..

” సర్వం విష్ణుమయం జగత్ “
” సర్వే జనః సుఖినోభవంతు “

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు