Friday, October 18, 2024
spot_img

ఉద్యోగినీలను లైంగికంగా వేదిస్తున్న సూపరిండెంట్ సల్లావుద్ధీన్

తప్పక చదవండి
  • సల్లావుద్ధీన్ ను చల్లాగా చూస్తున్న పై ఆఫీసర్లు
  • చర్యలకు ఉపక్రమించని డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్
  • ఉన్నతాధికారుల సపోర్టుతో ఆయనది ఇష్టారాజ్యం
  • ఓ మహిళ ఆత్మహత్య కేసులో సరూర్ నగర్ పీఎస్ లో కేసు
  • కీచకుడి అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసిన కాలయాపన
  • వైద్యారోగ్యశాఖలో సల్లావుద్ధీన్ రాస‌లీల‌ల‌పైనే చర్చ
  • మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ దృష్టి సారించాలంటున్న మ‌హిళా ఉద్యోగులు

‘కోడలికి సుద్దులు చెప్పి.. ఆ తర్వాత అత్త ఏదో నేర్చిందట’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలోని పైస్థాయి అధికారుల పనితీరు… డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ మ‌రియు ఫ్యామిలీ వెల్పేర్ లో పనిచేసే సూపరిండెంట్ సల్లావుద్ధీన్ మహిళా ఉద్యోగినీలను లైంగికంగా వేధిస్తున్నాడు. డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసే ఏఎన్ఎం, నర్సు, ఇతర ఉద్యోగినీలను టార్చర్ పెడుతూ తన కామ కోరికలకు తీర్చుకుంటున్న కీచకుడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. పెద్దసారు రాసలీలు అన్నీ కావు. ఎవరూ అందంగా కనబడితే వారితో మాటలు కలిపి, ఫోన్ నెంబర్, అడ్రస్సులు తీసుకొని తరచూ వేధించడం అలవాటుగా మారింది. ఇతగాడి (సూపరింటెండెంట్) లైంగిక వేధింపులను తట్టుకోలేక 2023, జూలైలో ఓ స్టాప్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. డెంటల్ ఆస్పత్రిలో పనిచేసే స్టాప్ నర్సు జాయ్ మెర్సీ… సూసైడ్ చేసుకుంది. అప్పట్లో డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ లో పెద్ద రచ్చ అయింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సల్లావుద్ధీన్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. రెండు నెల‌ల పాటు విధులకు రాకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉన్నత ఉద్యోగుల అండతో దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆ రోజులను మెడికల్ లీవ్ కింద పరిగణించేలా చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సల్లావుద్ధీన్ జైళ్లో ఊసలు లెక్కపెట్టాల్సిందిపోయి దర్జాగా ఆఫీస్ ప్రాంగ‌ణంలో తిరుగుతూ ఉద్యోగం చేసుకుంటున్నాడు.

‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఇంకా బుద్ధిమార్చుకోకుండా మహిళా ఉద్యోగినీలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. మరో దళిత మహిళా ఉద్యోగినీని లైంగికంగా వేధించాడు. 2018 నుంచి ఇప్పటి వరకు ఆమెను టార్చర్ పెడుతున్నాడు. అప్పట్లో ఆ మహిళతో మాటలు కలిపి దగ్గరయ్యాడు. ఏదోరకంగా వలలో వేసుకొని శారీరకంగా వాడుకున్నాడు. తరచూ ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ, బూతు బొమ్మలు, వీడియోలు పంపడమే గాక వాళ్లిద్దరూ ఏకాంతంగా గడిపినప్పుడు ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సల్లావుద్ధీన్ టార్చర్ భరించలేక, అటు పోలీసులకు ఇటు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయలేక ఏళ్లుగా మానసికంగా కుమిలిపోయింది. ఇటీవల సదరు మహిళ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహా, డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ సంచాలకులకు ఫిర్యాదు చేసిన నేటికి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యామేంటి. అప్పటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అండదండల‌తో అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ సంచాల‌కులు ర‌వీంద‌ర్ నాయ‌క్ ప్రోద్భలంతోనే పాడుపనులు చేస్తూ వైద్యారోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నాడని ఉద్యోగ‌స్తులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు వ‌చ్చినా చ‌ర్య‌లు తీసుకోకుండా తొక్కిపెట్ట‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం..

- Advertisement -

సల్లావుద్ధీన్ పై ఎన్నోసార్లు వివిధ ప త్రిక‌ల్లో వార్త‌లు వచ్చినప్పటికి ప్రభుత్వ పెద్దలు, అధికార ఘనం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘చింతచచ్చిన పులుపు చావదు’ అన్నట్టు ఎన్ని ప్రభుత్వాలు మారిన పాలన తీరు, అధికారుల వైఖరి మారడం లేదంటూ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికార యంత్రాంగం చెప్పినట్టు సర్కారీ పెద్దలు తానా అంటే తందానా అన్నట్టు కాకుండా కొంచెం ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, ఇతర గవర్నమెంట్ కార్యకలాపాలు జరిగే చోట ఏం జరుగుతుంది.. ఏ అధికారి, ఏ ఉద్యోగి ఎలాంటి లంగ పనిచేస్తుండో అబ్జర్వు చేస్తే మంచిగుంటదని మేధావులు సూచిస్తున్నారు. డ్యూటీల కోసం ఆడవారు.. భర్త, పిల్లలు, కుటుంబాలను వదిలి వచ్చి చేసుకుంటుంటే సల్లావుద్ధీన్ లాంటి మగాళ్ల రూపంలో ఉన్న నరరూప రాక్షసులు.. మహిళా ఉద్యోగినీలపై కన్నుపడకుండా కఠినచర్యలు తీసుకోవాలని మ‌హిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు