Friday, October 18, 2024
spot_img

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

తప్పక చదవండి
  • ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జశ్విత కన్స్ట్రక్షన్స్‌ మోసాలు
  • అవినీతి అధికారుల అండదండలతో పెట్రేగిపోతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌
  • కాసులకు కక్కుర్తి పడి చట్టవిరుధంగా అనుమతులు ఇస్తున్న హెచ్‌ఎండిఎ అధికారులు
  • అనుమతులను రద్దు చేసిన కమిషనర్‌.. అయినా ఆగని నిర్మాణాలు
  • సామాన్యులను నిండా ముంచుతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌ యాజమాన్యం
  • జాతీయ బీసీ కమిషన్‌ స్పందించి అనుమతులు రద్దు చేసిన వైనం
  • అయినా కూడా రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి
  • దీనిపైనిగ్గు తేల్చాల్సిన అధికారులు నిద్రపోతున్నారా
  • అమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు చీదరించుకుంటున్న ప్రజలు
  • జశ్విత కన్స్ట్రక్షన్‌ లో ప్లాట్‌ కొనాలనుకుంటున్నారా తస్మాత్‌ జాగ్రత్త

హైదరాబాద్‌ : సామాన్య ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని పలు నిర్మాణ సంస్థలు మధ్య తరగతి ప్రజలను మోసగిస్తున్నాయి. అలాంటి కోవకే చెందింది జశ్విత కన్స్ట్రక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థ! రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో పలు నిర్మాణ సంస్థలు భూములను కొనుగోలు చేసి ప్లాట్లు నిర్మించి వ్యాపారం చేస్తున్నాయి. పేద మధ్య తరగతికి చెందిన ఉద్యోగులు సొంత ఇల్లు ఉండాలని లక్ష్యంతో రూపాయి రూపాయి కూడా పెట్టి ఎక్కడన్నా ఇల్లు కొనుక్కుందామని అనుకుంటారు. అలాంటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని జశ్విత కన్స్ట్రక్షన్‌ నిర్మాణ సంస్థ పలు మోసాలకు పాల్పడుతుంది. ఫేక్‌ అనుమతులను పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

అవినీతి అధికారుల అండదండలు.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న మోసాలు

- Advertisement -

జశ్విత కన్స్ట్రక్షన్‌ అనే నిర్మాణ సంస్థ చేస్తున్న మోసాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణాల కోసం వారు కొనుగోలు చేస్తున్న భూములపై ఇప్పటికే పలువురు భూములు మావంటు కోర్టులో కేసులు వేయడం జరిగింది. న్యాయస్థానాల్లో భూములకు సంబంధించిన పలు పత్రాలను భూ యజమానులు సమర్పించారు. ఇరువురి వాదోపవాదాలు విన్న కోర్టులు వారు సమర్పించిన భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన కోర్టులు కూడా భూయజమానులకు సంబంధించినవిగా తీర్పులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా అవినీతి అధికారుల అండదండలతో మాయ చేసి నిర్మాణాలు చేపడుతు మోసాలు చేస్తున్నారు కక్కుర్తి పడే అధికారులు ఉన్నన్ని రోజులు ఇలాంటి దొంగ నిర్మాణ సంస్థల కాలం చెల్లుబాటు అవుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇలాంటి వాటిని అరికట్టకుంటే సామాన్య ప్రజలు బలి అవుతారని పలువురు వాపోతున్నారు.

ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు చీ ధరించుకుంటున్న ప్రజలు

జశ్విత కన్స్ట్రక్షన్‌ అంటేనే ఒక అవినీతి కంపెనీ అని ఇలాంటి బోగస్‌ కంపెనీలకు వారిచ్చే కాసులకు కక్కుర్తి పడి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న అవినీతి అధికారులను చూసి సామాన్య ప్రజలు చీదరించుకుంటున్నారు. మీ పొట్ట నింపుకోవడం కోసం మధ్యతరగతి ప్రజల పొట్ట కొట్టకండి అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి బోగస్‌ కంపెనీల వద్ద ప్లాటు కొనవద్దని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ నిర్మాణ కంపెనీ ప్రజలను మోసగిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి కంపెనీ దగ్గర ప్లాట్లు కొనే ముందు ఒకసారి ఆలోచించాలని ప్రజలు బహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఆదినుండి ఈ నిర్మాణ సంస్థ ప్రజలను మోసగిస్తూనే ఉంది ఇప్పటికైనా ప్లాట్లు కొనకుండా జాగ్రత్త వహించాలని పలువురు భావిస్తున్నారు. బోగస్‌ కంపనీల పట్ల తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

కమిషనర్‌ రద్దు చేసిన ఆగని నిర్మాణాలు

గతంలో పలు ఫిర్యాదులు వెలువడిన సందర్భంగా జస్వంత్‌ కన్స్ట్రక్షన్‌ నిర్మాణ సంస్థ చేపడుతున్న పలు నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ కమిషనర్‌ అనుమతులు రద్దు చేశారు. మీరు కొలుగోలు చేసిన భూముల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని దీనిపై గతంలో భూ యజమానుల మంటూ కొందరు ఫిర్యాదు చేశారు వారి వద్ద ఉన్న భూమికి సంబంధించిన ఆర్డర్‌ కాపీలను కమిషనర్‌ కు ఇచ్చారు వాటిని పరిశీలించిన కమిషనర్‌ జస్వంత్‌ కన్స్ట్రక్షన్‌ కంపెనీకి అపార్ట్మెంట్‌ నిర్మాణం కోసమై ఇచ్చిన అనుమతులను అసలు ఇచ్చి రద్దు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న జస్వంత్‌ కన్స్ట్రక్షన్‌ నిర్మాణ సంస్థ యాజమాన్యం మళ్లీ అనుమతులు పొందామంటూ నిర్మాణాలను ప్రారంభించడం చూస్తుంటే మీరు మళ్లీ అనుమతులు ఎలా పొందారు అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఎండిఏ కార్యాలయంలో ఉన్న కొంతమంది అవినీతి అధికారుల చేతివాటంతో పనులను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి హెచ్‌ఎండిఏ లో ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అనుమతులు రద్దు చేసిన రిజిస్ట్రేషన్లు ఎలా..?
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామంలో ఉన్న సర్వే నెంబర్‌133/3 లో జశ్విత కన్స్ట్రక్షన్స్‌ వారు 5156 చదరపు మీటర్ల వైశాల్యంలో నివాస అపార్ట్మెంట్లు కడుతున్నారని ఇది అక్రమమని గతంలోనే ఆ భూమి తనదంటూ కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌ అనే వ్యక్తి హెచ్‌ఎం డి ఎ అధికారులకు, మరియు జాతీయ బీసీ కమిషన్‌ కు ఫిర్యాదు చేయడంతో పై విచారణ జరిపిన జాతీయ బీసీ కమిషన్‌ అనుమతులను రద్దు చేయాలంటూ నోటీసు పంపడం జరిగింది నోటీస్‌ నెంబర్‌ 010049/ ఎస్‌ కే పి/ ఆర్‌ 1/ యు6/ హెచ్‌ఎం డి ఎ/ 29032018/ ద్వారా 05/11/2021 నోటీసులు జారీ చేసి రద్దు చేశారు. ఇది ఇలా ఉంటే ఇదివరకే ఆర్తి కన్స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరు మీద అగ్రిమెంట్‌ మరియు జిపిఏ ఉన్న కూడా హెచ్‌ఎండిఏ ఎలా పర్మిషన్‌ ఇచ్చిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే విధంగా రేరా లో కూడా పత్రాలు అన్ని సరిగ్గా ఉన్నాయని తెలపడంలో మతలబెంటో వారికే తెలియాలి. దీన్ని బట్టి చూస్తే హెచ్‌ఎం డి ఏ అధికారులు ఎంత నిజాయితీపరులో అర్థమవుతుంది! అవినీతిలో కూడా నిజాయితీని చూపెడుతున్న అధికారులను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతుంటే అందులో ప్లాట్లు కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి లక్షలు వెచ్చించి ప్లాట్లు తీసుకున్న బాధితులకు న్యాయం జరిగేనా వారికి దక్కేనా అని అనుమానం తలెత్తుతోంది. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకే పంగనామాలు పెడుతుండడం చూస్తుంటే బాదేస్తుందని పలువురు బాధితులు వాపోతున్నారు. అధికారులను సమాచారం అడిగిన సమాచారం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి పూర్తి విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు