హైదరాబాద్: తెలంగాణలోని సికింద్రా బాద్‌లోని మిలీనియం గార్డెన్లో ఘనంగా జరిగిన ఒక వేడుకలో హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ (అధీకృత ఫోర్స్ మోటార్స్ డీలర్) ద్వారా 10 ఫోర్స్ అర్బానియాలను ‘‘విక్టర్ లాజిస్టిక్స్’’ కు డెలివరీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కోచ్ మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ మాచా మాట్లాడుతూ, ‘‘ఈ వాహనాలను విక్టర్ లాజిస్టిక్స్’’ లో చేర్చి, జేపీ మోర్గాన్ సిబ్బంది రాకపోకలకు వినియోగించను న్నారు. ఫోర్స్ అర్బానియా భారతీయ మార్కెట్లో పోల్చ దగిన ఉత్పత్తి లేకుండా తనదైన స్వంత తరగతిలో ఉంది. ఇది గ్లోబల్ ట్రావెలర్ కోసం నిజంగా అంతర్జాతీయ స్టైలింగ్, సౌకర్యం, భద్రత, పనితీరును అందిస్తుంది. ప్రీమియం టూర్ అండ్ ట్రావె ల్స్, ఆతిథ్య పరిశ్రమ కార్పొరేట్ ప్రయాణాలకు అర్బా నియా అనువైనది.
అర్బానియా ఎంతో సామర్థ్యం కలది మరియు బహు ముఖమైనది. ఇది సీనియర్ మేనేజ్ మెంట్ ప్రయాణానికి షటిల్ వ్యాన్‌గా లేదా అత్యంత ఉన్నతమైన విహారయాత్రల కోసం టూర్ వ్యాన్‌గా అయినా, ప్రతి రకమైన కస్టమర్ల అవసరాలకు అనుగు ణంగా రూపాంతరం చెందుతుంది. అర్బానియా భారత దేశంలో రూపొందించబడిరది, అభివృద్ధి చేయబడిరది. ఇటలీ, జర్మనీ, జపాన్, స్పెయిన్, యూకే, అమెరికా నుండి ప్రముఖ డొమైన్ నిపు ణులచే మెరుగుపరచబడిరది. ఇది సెగ్మెంట్లోని అత్యుత్తమ ఆఫ ర్లతో ప్రామాణీకరించబడిరది మరియు ప్రతి ప్రయాణీకుడికి గరిష్ట స్థలాన్ని అందిస్తుంది. క్లాస్ సీటింగ్ సౌకర్యం, ఎయిర్ కండిషనింగ్, భద్రత, కస్టమర్ యొక్క ప్రయాణాన్ని ఆహ్లాదకరం చేసే ఆలోచనాత్మకమైన సౌకర్యాలను అందిస్తుంది.