Thursday, September 19, 2024
spot_img

డిసెంబర్‌ 10న న్యూట్రిషన్‌ పై అవగాహన సదస్సు

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఫిజీషియన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ న్యూట్రీషియన్‌ (పాన్‌) ఆధ్వర్యంలో ఈ నెల 10న బంజారాహిల్స్లోని హోటల్‌ రాడిసన్‌ బ్లూలో ఫుడ్‌, న్యూట్రీషియన్పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ రాజేందర్‌ డాక్టర్‌ ప్రత్యూష లు తెలిపారు.గురువారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిరచచారు. దైనందిన జీవితంలో చాలా మంది మధుమేహం, రక్తపోటు బారిన పడుతున్నారని, వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ఆ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా ఆహార సమతుల్యత, ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోకపోవడమే ఆ వ్యాధులకు కారణమవుతున్నాయని, తెలిపారు. కరోనా తర్వాత దీనిపై కొంత అవగాహన పెరిగినా సరైన సూచనలు చేసే వారు లేరన్నారు. ఇలాంటి తరుణంలో వ్యాధుల బారిన పడుకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలని, ఏ నియమాలు పాటించాలన్న అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు