Friday, October 18, 2024
spot_img

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

తప్పక చదవండి
  • కందనూలులో కాంగ్రెస్‌ భారీ విజయోత్సవ ర్యాలీ
  • ఇది ప్రజా విజయం : డాక్టర్‌ రాజేష్‌రెడ్డి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌర స్తాలో ఎన్నికల అధికా రులు ఆదివారం వెలువరిం చిన ఫలితాల్లో తన సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్థన్‌ రెడ్డిపై 5,871ఓట్ల సతేడాతో గెలుపొందారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. గత నెలలో వెలువడిన నోటిఫికేషన్‌ నాటి నుంచి ముగిసేవరకు జరిగిన ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. తొలిరౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకూ ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బూత్‌లవారీగా తిమ్మాజిపేటలో మర్రికి ఆధిక్యం రాగా బిజినేపల్లిలో కాంగ్రెస్‌కు వచ్చిన ఆధిక్యం సమానం చేసింది. తర్వాత నాగర్‌కర్నూల్‌ టౌన్‌, రూరల్‌లోనూ రాజేష్‌ రెడ్డికి మంచి ఆధిక్యత రాగా తెలకపల్లిలో దాదాపుగా 6వేల మెజార్టీకి చేరుకొనడంతో కాంగ్రెస్‌ విజయం దాదాపుగా ఖాయమైంది.

చివరికి 5,871ఓట్లతో రాజేష్‌ రెడ్డి గెలుపొందినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ ప్రకటించి, ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా రాజేష్‌ విజయంతో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు జిల్లా కేంద్రానికి చేరుకొన్నారు. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి రాజేష్‌ రెడ్డి కేంద్రంలోనే ఉండగా మర్రి మాత్రం రాలేదు. ఇక విజయం ఖరారైనాక లెక్కింపు కేంద్రం నుంచి రావడంతో శ్రేణులు నినాదాలు చేస్తూ రాజేష్‌ రెడ్డిని ఎత్తుకొన్నారు. అనంతరం మాజీ మంత్రి, కొల్హాపూర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావును కలిసి ఒకరినొకరు అభినందించుకొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో రాజేష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, సోనియా, రాహుల్‌, రేవంత్‌ నాయకత్వాలను కోరుకున్నారని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పలికారన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటుగా మంచి పరిపాలన అందిస్తామన్నారు. తన తండ్రి, ఎంఎల్‌సీ కూచుక్కుళ్ల దామోదర్‌ రెడ్డి అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేస్తామన్నారు. అనంతరం కౌంటింగ్‌ కేంద్రం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా పలు కూడళ్లలో పటాకులు పేలుస్తూ, డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, జక్క రాజు, కావలి శ్రీను, కూచుకుళ్ల రాకేష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు