Friday, September 20, 2024
spot_img

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

తప్పక చదవండి
  • ఆలయ మహాద్వారం ప్రవేశం
  • వేదాశీర్వచనం చేసిన పండితులు
  • శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు
  • అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ
  • వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి

శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తాయి. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గంగాధర మండపం, ఉత్తర శివమాఢ వీధిలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో మల్లికార్జుని దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. ధర్మపురిలో గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కాళేశ్వరం, యాదాద్రి ఆలయాల్లో కూడా రద్దీ కొనసాగింది.

తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని ప్రధాని దర్శించుకున్నారు. మోదీకి అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి విూదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ జీయర్‌లు శ్రీవారి శేష వస్త్రంతో మోదీని సత్కరించారు. దర్శనానంతరం వకులమాత, విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపం వద్ద మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ప్రధాని హోదాలో మోదీ నాలుగో సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుమలకు చేరుకున్న మోదీ ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ కంటే అర్ధగంట ముందుగానే అంటే 7:30 గంటలకే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మోదీ ఒక్కరే శ్రీవారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ప్రధానితో పాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తిరుమలకు చేరుకున్నప్పటికీ మోదీ మాత్రమే ఒంటరిగా స్వామివారిని దర్శించుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. అలాగే విూడియాపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేశారు. గతంలో మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన మూడు సందర్భాల్లో కూడా ప్రధాని పర్యటనను కవర్‌ చేసేందుకు విూడియాకు అనుమతించింది. అయితే నేడు మోదీ పర్యటనను కవర్‌ చేసేందుకు విూడియాను కూడా అనుమతించని పరిస్థితి. అత్యంత రహస్యంగానే మోదీ పర్యటన కొనసాగింది. దర్శనానంతరం ఆయన బస చేసిన అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, అల్పాహారం సేవించిన అనంతరం కాసేపటి క్రితమే మోదీ తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

- Advertisement -

అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ
వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగింది. ప్రాఃతకాలం నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా వరుసగా రెండోరోజు సోమవారం నలుమూలల నుంచి విచ్చేసిన అశేష భక్తులతో భక్తజనసంద్రమైంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజాము నుంచే సర్వదర్శనాలు ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యదేవుడి సన్నిధి రెండో కార్తీక సోమవారం పర్వదినం కావడంతోపాటు పౌర్ణమి, స్వామివారి గిరిప్రదక్షణ తదితర పుణ్యదినం కావడంతో రద్దీ సోమవారం కొనసాగనుంది. స్వామివారి వ్రతం ఆచరించుకోవడానికి ఆదివారంరాత్రికే భక్తులు సత్యదేవుడి సన్నిధికి చేరుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు వసతి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉచిత డార్మెటరీలు కొందరు వినియోగించుకున్నారు. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం పంపాహారతులు కార్యక్రమంఘనంగా చేపట్టనున్నారు. సాయంత్రం 6గంటలకు స్వామి,అమ్మవార్లను పంపాతీరం వద్దకు పండితులు తీసుకునివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం నదీమతల్లికి ఏక, బిళ్వ, సర్ప, నాగ, నక్షత్ర తదితర ఏడు రకాలైన హారతులిస్తారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనంతరం స్వామి, అమ్మవార్లను తిరిగి కొండపైప్రదానాలయాలనికి తీసుకెళతారు. సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం జ్వాలాతోరణం కార్యక్రమం వేడుకగా జరిగింది. సాయంత్రం 5.30గంటలకు స్వామి, అమ్మవార్లను పల్లకిలో మెట్ల మార్గం గుండా మేళతాలాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కొండదిగువ తొలిపావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి తొలిపావంచాకు ఇరుపక్కల ఎండుగడ్డితో తోరణాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 7గంటలకు భక్తుల గోవిందనామస్మరణల నడుమ జ్వాలను రగిలించారు. స్వామి, అమ్మవార్లు పల్లకిలో ముమ్మారు జ్వాలాతోరణం చుట్టూ ప్రదక్షణ గావించారు. భక్తులు జ్వాలాతోరణ భస్మం కోసం పోటీపడ్డారు. కార్యక్రమం పూర్తయ్యేవరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి జాతీయ రహదారి విూదుగా మల్లించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు