Friday, September 20, 2024
spot_img

మఖ్తల్ పట్టణం… “బండారు ” మయం…

తప్పక చదవండి
  • సిద్ధిరామయ్య రోడ్ షోకు పోటెత్తిన ప్రజలు ..
  • లక్ష మెజార్టీతో శ్రీహరిని గెలిపించండి.
  • కర్ణాటక సీఎం సిద్ధరామయ్య…
  • మఖ్తల్ నవంబర్ 26 ఆదాబ్ హైదరాబాద్ …

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మక్తల్ నియోజకవర్గ కేంద్రం లో రోడ్ షో కు నియోజకవర్గ ప్రజలు పోటెత్తారు. మఖ్తల్ అంబేద్కర్ చౌరస్తా పూర్తిగా “బండారు” మయమైంది. స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. మొదటగా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని మరిచి పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తుందని దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి సొమ్ముతో రాజ్యాన్ని ఏలుతుందని దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లక్ష కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు అని మూడు నాలుగు ముచ్చటగా నేడు ఆ ప్రాజెక్టు దుస్థితి ఎలా ఉందో ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని ఇంతకంటే ఎక్కువ ఇంకేమైనా చెప్పాలా అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కావడం లేదని దుష్ప్రచారాన్ని మానుకోవాలని మేము ఇచ్చిన ఐదు గ్యారంటీలో 4 పథకాలను అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేశామని మరొక పథకాన్ని జనవరి నుండి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండగా అనేక వాగ్దానాలు చేసి కనీసం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు రేషన్ కార్డ్స్ పింఛన్లు అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ మక్తల్ నియోజకవర్గంలో పేద కుటుంబం నుంచి వచ్చిన వాకిటి శ్రీహరి పై ఇంత అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి లక్ష మెజార్టీతో ఈ మక్తల్ ముద్దుబిడ్డను శ్రీహరిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బోస్ రాజ్. తోపాటు కర్ణాటక నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి. గవినోల బాలకృష్ణారెడ్డి. మాజీ సర్పంచ్ మాన్వి రామారావు, ఆంజనేయులు గౌడ్,
గోపాల్ రెడ్డి. లక్ష్మారెడ్డి. రవికుమార్ యాదవ్, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గడ్డంపల్లి హనుమంతు, పారేవుల విష్ణు, శేఖర్ గౌడ్, తోపాటు వివిధ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు