Thursday, September 19, 2024
spot_img

ఓటుకు రూ.వెయ్యి

తప్పక చదవండి

శేరిలింగంపల్లిలో పంపకాలు షురూ..!

  • డబ్బులు వద్దంటే ఇతర తాయిలాలు
  • ఎంపిక చేయబడ్డ అభ్యర్థుల చేత డబ్బుల పంపిణీ..
  • బూత్‌ల వారీగా టార్గెట్లు ఫిక్స్‌
  • చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న.. అధికార యంత్రాంగం..

శేరిలింగంపల్లి : ప్రచారం అంతిమ గడియలకు చేరుకున్న వేళ శేరిలింగంపల్లి సెగ్మెంట్‌లో డబ్బుల పంపిణీ షురూవైంది. అన్ని పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విచ్చల విడిగా డబ్బుల పంపిణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నియోజకవర్గంలో మొత్తం 622 బూత్‌ లున్నాయి. రాష్ట్రంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం అతిపెద్దది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కో ఓటును ఒడిసిపట్టుకునేందుకు ఓటర్లకు కాసుల వర్షం కురిస్తున్నాయి. ఆదివారం ఓ జాతీయ పార్టీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంచేయగా.. మరికొన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నాయి. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు,ఆయా పార్టీల ముఖ్య నేతలు బూత్‌ల వారీగా ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఈటీంల్లోని సభ్యుల ద్వారా ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువగా రూ.వెయ్యి,ఆపైన తగ్గకుండా నియోజకవర్గ వ్యాప్తంగా డబ్బులను పంచేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపినగర్‌,నెహ్రునగర్‌,పాపిరెడ్డినగర్‌,దూబే కాలనీతో పాటు సెగ్మెంట్‌ లోని పలు బస్తీల్లో ఆదివారం ఓ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటికే రూ.వెయ్యి చొప్పున డబ్బులు పంచేయడం గమనార్హం. ఒకవేళ ఎవరైనా డబ్బులు తీసుకోకపోతే అలాంటి ఓటర్లను గుర్తించి వారిని మచ్చిగ చేసుకునే మార్గాలపై ఆయా పార్టీల నేతలు దృష్టి పెడుతున్నారు. వారికి ఏం ఇస్తే తమ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారనే అంశాలపై ఆరా తీసి వారి అవసరాల తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీల నేతలు డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని నమ్మక స్తులకే అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారానే పంపిణీని కొనసాగిస్తున్నట్లు సమాచారం. పోలింగ్‌ కు మరో 3 రోజులే ఉన్నందున..అలాగే శేరిలింగంపల్లి సెగ్మెంట్‌ రాష్ట్రంలోనే అతి పెద్దది అయినందున నియోజకవర్గంలోని అన్ని ప్రాం తాల్లో ఓటర్లకు డబ్బులు ముట్టేలా ఆయా పార్టీల నుంచి పోటీ ఉన్న అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అత్యంత డెవలప్డ్‌ సెగ్మెంట్‌ అయిన శేరిలిం గంపల్లిలో అన్ని రాజకీయ పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. అధికార యంత్రాంగం మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు