Thursday, October 24, 2024
spot_img

జనగామలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

తప్పక చదవండి
  • దోపిడీ బీఆర్‌ఎస్‌కు పాతర తప్పదు
  • రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
  • కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి

జనగామ : జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైపోయిందని కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ముత్తిరెడ్డి దోపిడీని గుర్తించి ఓడిరచాలనుకున్న తరుణంలో పల్లాను పార్టీ రంగంలోకి దింపిందని అన్నారు. ఇదికూడా ప్రజలు గమనించారని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో అనూమ్యస్పందన వస్తోందని, ఈసారి కాంగ్రెస్‌ను గెలపించి బీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ సభలకు వేలాదిగా తరలివచ్చి ఆశీర్వదించడమే నిదర్శమని అన్నారు. మరొక్కసారి దొరల గడీలను బద్దలు కొట్టడానికి వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే దొరల తెలంగాణ బలపడుతుందని ప్రజలు ఏది కావాలో తేల్చుకోవాలని సూచించారు. జనగామ భవిష్యత్తు, అభివృద్ధి ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ముత్తిరెడ్డి తొమ్మిదేళ్లు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తొమ్మిదేళ్లుగా పూర్తిగా దోపిడీకి గురిచేశారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతానన్నారు. టీపీసీసీ చీఫ్‌ వంత్‌ రెడ్డి నాయకత్వంలో జనగామను మరింత అభివృద్ధి చేసుకునేందుకు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేడు జనగామలో ప్రెస్టన్ హైస్కూల్ జరిగే సమర శంఖారావం భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్రమల్ల సుధాకర్, కొత్త కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర్మ గోవర్ధన్ రెడ్డి, చరబుడ్ల దయాకర్ రెడ్డి , వడ్లకొండ పిఏసీఎస్ డైరెక్టర్ వంగల మల్లారెడ్డి, జనగామ జిల్లా మాజీ అధికార ప్రతినిధి మేడ శ్రీనివాస్, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్, చేంచరపు బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్యల నర్సింగరావు, ఎంపీటీసీ మెరుగు బాలరాజు, బడికే కృష్ణ స్వామి ఎండీ అన్వర్, ఆలేటి సిద్దిరాములు, చేంచారపూ కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేశ్, గాదపక రామచందర్, జక్కుల వేణు మాధవ్, రామగళ్ళ విజయ్, గనిపక మహేందర్, రంగరాజు ప్రవీణ్ ,మినుకురి మహేందర్ రెడ్డి, దోర్నాల వెంకటేశ్వర్లు, తాటి కనుక స్వామి, వెంకట్ రెడ్డి పట్టురి శ్రీనివాస్, కట్ట కృష్ణ, కోట నాయక్, జయ మల్లేష్ తోట సత్యం, దాసరి శేఖర్, బత్తినీ శ్రీశైలం, దాసరి క్రాంతి, గందమల్ల కమలాకర్, గుగ్గీల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు