Tuesday, October 29, 2024
spot_img

మళ్లీ వచ్చేది కారే…(కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు గతి లేక… మేం టిక్కెట్లు ఇవ్వని వాళ్లకు టిక్కెట్లు)

తప్పక చదవండి
  • గ్రెస్ పార్టీ 10 మంది సీఎం అభ్యర్థులమంటూ కొట్లాడుతున్నరు
  • 50 సీట్లలో వాళ్లకు అభ్యర్థులు లేక బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చారు
  • కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థులెవరు…?
  • బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వని వారికి కాంగ్రెసోళ్లు టిక్కెట్లిచ్చారు
  • టిక్కెట్లు ఇవ్వడానికి అభ్యర్థులు లేని పార్టీ కాంగ్రెస్
  • దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

దేవరకద్ర : కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు గతి లేక… తాము టిక్కెట్లు ఇవ్వని వాళ్లను పిలుచుకుని టిక్కెట్లు ఇచ్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం అభ్యర్థులున్నారని… సీఎం కుర్చీ కోసం వాళ్లు కొట్లాడుతూనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 50 సీట్లలో వాళ్లకు అభ్యర్థులు లేక బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందన్నారు. కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, గద్వాలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి ఇచ్చిందో చూడాలన్నారు. తాము టిక్కెట్ ఇవ్వని వారికి కాంగ్రెసోళ్లు టిక్కెట్లిచ్చారని అన్నారు. టిక్కెట్లు ఇవ్వడానికి అభ్యర్థులు లేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ప్రసంగించారు… కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ వచ్చేది కారే… సీఎం కేసీఆరే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వదిలేసిన వాళ్లను పట్టుకుని టిక్కెట్లు ఇచ్చి మేం గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ తీరును మంత్రి ఎండగట్టారు. నిజంగా ఆ పార్టీ అధ్యక్షునికి దమ్ముంటే గాంధీ భవన్ లో కూర్చుని పార్టీ టిక్కెట్లను కేటాయించాలని అన్నారు. కనీసం 20, 30 సీట్లు గెలిచే పరిస్థితి లేని పార్టీ అది అని ఆయన అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ధైర్యంగా టిక్కెట్లు ఇచ్చి పంపిన పార్టీ తమదన్నారు. తెలంగాణను అణచివేసిన వాళ్లు… ఇప్పుడు తెలంగాణ పచ్చబడుతుంటే ఓర్వలేక పోతున్నారని అందుకే అబద్ధపు హామీలతో కొత్త వేశం వేసుకుని వచ్చారని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందని మంత్రి తెలిపారు.

కర్ణాటకలో కనీసం 5 గంటల కరెంటు కూడా లేదు…
కర్ణాటకలో కనీసం 5 గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదని… సాక్షాత్తు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని… అలాంటి పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని అంటున్నాడని… ఎవుసం నాశనం చేయడమే వారి ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు ఉండదు, నీళ్లుండవు, రూ. 2016 ఇస్తున్న పింఛన్లను మళ్లీ రూ. 200 చేసేస్తారని అన్నారు. రకరకాల వేశాలు, కండువాలు కప్పుకుని మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని.. వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండని అడుక్కుంటున్నారని… 11 సార్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశన చేశారని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 లక్షల మంది వలసలు వెళ్లాలే చేశారని విమర్శించారు. పొరపాటున వారికి అవకాశం ఇస్తే కుక్కలు చింపిన విస్తరాకును చేసేస్తారని తెలిపారు. వారి దరిద్రమైన పాలన చూశామని వారిని దూరం పెడితేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారు…
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని తెలిపారు. కందూరు వాగు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే పారేదని… తెలంగాణ ఏర్పడిన ఫలితంగా ఇప్పుడు ఎండాకాలం కూడా వాగు పారుతున్నదని… వర్షం లేకపోయినా వాగు నీళ్లతో కళకళలాడుతోందన్నారు. వాగులన్నీ చెక్ డ్యాంలతో కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక చెక్ డ్యాంలున్నది మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క చెక్ డ్యాం కట్టనోళ్లు ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రైతులను దివాళ తీయించారని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని విధంగా చేశారని తెలిపారు. పగలు ఇంటి వద్ద రాత్రి పొలం వద్ద పడుకునే పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు ఆన్ చేసేందుకు వెళ్లి పొలం వద్ద అనేక మంది రైతులు పాములు కరిచి చనిపోయారని గుర్తుచేసుకున్నారు. నిరక్షరాస్యత, వలసలు, లేబర్ అన్నింటికి అప్పుడు మహబూబ్ నగర్ ఫేమస్ అని… కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంత మార్పు చెందిందన్నారు. చదువు, వ్యవసాయం, కులవృత్తులు, అన్నింట్లో మనం బాగుపడ్డామని తెలిపారు. గత పాలనలో వసతి గృహాల్లో పురుగుల అన్నం తినే పరిస్థితి లేకుండేదని… పిల్లలు హాస్టళ్లలో ఉండాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు 1000 గురుకులాలు ఏర్పాట చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. త్వరలో పేద ఓసీలకు కూడా గురుకులాలలు ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు