పేరుకు జాతీయ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులు..
ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం ప్రాకులాడటం..
విధి వైపరీత్యమా ? స్బయంకృతమా ?!
తెలుసుకునే సోయి ఇప్పటికైనా
వుంటే స్వీయ సమీక్ష చేసుకోవాలే..
నేల విడిచి సాము చేయడం మాని,
ప్రజల్లోకి పోవాలి..
కాలం మారింది,
ప్రజల ఆలోచనలు మారాయి..
సిద్ధాంతాల రాద్ధాంతాలు వొదిలి..
కాలగమనంలో మార్పును
అంగీకరించకుంటే కాలగర్భంలో
కలసిపోవడం ఖాయం కామ్రేడ్ !
- సాగర్