Friday, September 20, 2024
spot_img

నామినేషన్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసాం

తప్పక చదవండి
  • ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్టీవో శ్రీనివాసరావు

తాండూరు : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ఆయిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాండూర్‌ అసెంబ్లీ ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు 56 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను అధికారులతో సమావేశం నిర్వహించి పోలీసుల సహకారంతో ఏర్పాట్లను ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.ఈ సందర్భంగా ఆర్డిఓ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ ఉందని. నామినేషన్‌ దాఖలు చేయాలనుకునే అభ్యర్థి తోపాటుగా కేవలం ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఉదయం 11 గంటల సమయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయించిన నిర్ణీత సమయానికి కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు పేర్కొన్నారు.ప్రతి అభ్యర్థి విధిగ తన పేరిట బ్యాంకు ఖాతా తెరవాల్సిన ఉంటుంది. నామినేషన్లు స్వీకరించే మొదటి రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగాఫామ్‌ 2బి అనే నామినేషన్‌ పత్రం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసి ఓటర్గా ఉన్న దానిని ఎలక్ట్రో రిజిస్ట్రేషన్‌ అధికారి సర్టిఫికెట్‌ చేసిన పత్రంతో నామినేషన్‌ వెయ్యాలని అలాగే నామినేషన్‌ వేసే జనరల్‌ అభ్యర్థులు 10000 రూపాయల డిపాజిట్‌ చేయాలని అదే రిజర్వేషన్‌ అభ్యర్థులు అయితే 5000 డిపాజిట్‌ చేయాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌ డిక్‌ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 648 మందితో ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు