Friday, September 20, 2024
spot_img

బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

తప్పక చదవండి
  • మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి

పాపన్నపేట : బీఆర్‌ఎస్‌ కు ఓటేస్తే అభివృద్ధి బాటలో నడుస్తామని కాంగ్రెస్‌ కు ఓటేస్తే కష్టాల పాలవుతామని మెదక్‌ బిఆర్‌ ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.గురువారం పాపన్నపేట మండలం పరిధిలో ని ఆర్కేల,తమ్మాయిపల్లి, నార్సింగి,బాచారం, సీతానగరం,బాచారం, గాజులగూడెం,ఎంకేపల్లి,కొడపాక తదితర గ్రామాల్లో పద్మా దేవేందర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.పద్మా దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తిరిగి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని,మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలతో పాటు, మేనిఫెస్టోలో పెట్టిన మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కెసిఆర్‌ బీమాపథకం ద్వారా 93 లక్షల మంది ప్రయోజనం చేకూర్చునున్నట్లు చెప్పారు.ఆరు నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేతులెత్తేసినట్లు ఆరోపించారు. అక్కడ రైతులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయని, మన రాష్ట్రంలో పంటల సాగుకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు.13 ఏళ్లపాటు పత్తా లేకుండా పోయి తన కొడుకుని ఎమ్మెల్యేను చేసేందుకు మెదక్‌ కు వచ్చినట్లు ఆరోపించారు.నియోజవర్గంపైఎలాంటి అవగాహన లేని వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వెల్లడిరచారు.మెదక్‌ జిల్లా కేంద్రం కావడంవల్ల జిల్లా కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినట్లు చెప్పారు. ముందుగా మండల పరిధిలోని కొత్తపల్లిలో బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు,ఏడుపాయల దేవస్థానం కమిటీ చైర్మన్‌ ఎస్‌. బాలా గౌడ్‌,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్‌, నాయకులు విష్ణువర్ధన్‌ రెడ్డి,గడిల శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు