Friday, October 18, 2024
spot_img

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ షో

తప్పక చదవండి
  • ప్రత్యేకంగా జియోసినిమా ఓటిటి లో ఇండియన్ ఏంజిల్స్
  • మొదటి రెండు ఎపిసోడ్‌లు నేటి నుండి ప్రసారం

తదుపరి ఎపిసోడ్‌లు ప్రతి వారం రెండు చొప్పున ఓటీటీలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏంజెల్ ఇన్వెస్ట్‌ మెంట్ షోగా పేర్కొనబడిన “ఇండియన్ ఏంజిల్స్” ప్రీమియర్ రేపు నవంబర్ 3న జియోసినిమా లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం రేపటి నుండి ప్రతి వారం రెండు ఎపిసోడ్‌లను ప్రసారం చేస్తుంది, ఫీచర్ చేసిన స్టార్టప్‌లతో నిమగ్నమవ్వ డానికి ప్రేక్షకులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇండియన్ ఏంజిల్స్ తన వినూత్న విధానంతో విభిన్నంగా ఉంటుంది, చిన్న పట్టణాల్లో తమ వ్యవస్థాపక ప్రయాణాలను ప్రారంభించి, తదనంతరం అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను రూపొందించిన నిష్ణాతులైన వ్యాపార నాయకుల ప్యానెల్‌ను ఇది ప్రదర్శిస్తుంది. కైనెటిక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అజింక్యా ఫిరోడియా; ఇన్సూరెన్స్ దేఖో వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్, శోభితం సహ వ్యవస్థాపకులు & చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అపర్ణ త్యాగరాజన్; వాల్యూ 360 వ్యవస్థాపకుడు & డైరెక్టర్ కునాల్ కిషోర్; సహ వ్యవస్థాపకుడు రికాంత్‌పిట్టి; సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు శ్రీధా సింగ్ ఈ విశిష్ట ప్యానెల్‌లో ఉన్నారు. డిజికోర్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అభిషేక్ మోర్ ఈ షో ప్రారంభం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘రేపు రెండు ప్రారంభ ఎపిసోడ్‌లను విడుదల చేయడంతో ‘ఇండియన్ ఏంజెల్స్’ ను ప్రారంభించడం పట్ల మేము థ్రిల్‌గా ఉన్నాం. కొన్ని రోజుల క్రితం ఈ ప్రదర్శనను మేం ఆవిష్కరించినప్పటి నుండి స్పందన చాలా సానుకూలంగా ఉంది. స్టార్టప్ వృద్ధిపై భారతీయ ప్రేక్షకులకు ఉన్న గాఢమైన ఆసక్తిని గుర్తించి, దా న్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిదాయకంగా రూపొందించాం. దాంతో ఈ ప్రదర్శన వినో దాత్మకంగా మాత్రమే కాకుండా యాక్సెస్ చేసేందుకు వీలుగా ఉంటుందని కూడా మేము నిర్ధారించాం, తమ అభిమాన స్టార్టప్‌ల పెరుగుదలలో వీక్షకులు కూడా చురుకుగా పాల్గొనేలా చేశాం. ఇది అందరికీ తిరుగులేని అనుభవాన్ని అందిస్తుందని మేం నమ్ముతున్నాం. ప్రేక్షకుల స్పందన కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
ఇండియన్ ఏంజిల్స్ సంప్రదాయ ఏంజెల్ ఇన్వెస్ట్‌ మెంట్ టెలివిజన్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పుల ను తీసుకువచ్చే అద్భుతమైన భావనను పరిచయం చేసింది. అనుభవజ్ఞులైన వ్యాపార ఏంజిల్స్ తో కలిసి పెట్టుబడి పెట్టడం ద్వారా ఫీచర్ చేసిన స్టార్టప్‌ల విజయంలో చురుకుగా పాల్గొనేందుకు వీక్షకులకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ వినూత్న విధానం వీక్షకులకు వినోదభరితమైన వినోదాన్ని అందించడమే కాకుండా వ్యవస్థాపక ప్రయాణంలో భాగం అయ్యేలా వారికి శక్తినిస్తుంది. ఇది వినోదం మరియు పెట్టుబడి మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది, ఇది అందరికీ తిరుగులేని, సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు