Friday, September 20, 2024
spot_img

నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు

తప్పక చదవండి
  • జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు..

సూర్యాపేట : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్‌ అధికా రుల కార్యాలయంలో వచ్చేనెల మూడవ తేదీ నుంచి చేపట్టే నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు తెలిపారు .ఆదివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హలు నందు అదనపు కలెక్టర్‌ రెవెన్యూ ఏ. వేంకట రెడ్డి తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోస్టల్‌ బ్యాలెట్‌, సువిధ-ఆనుమతులు, కౌంటింగ్‌ హాల్స్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం, నామినేషన్లు, నియమాలు మరియు నిబంధనలు గురించి చర్చించారు నామినేషన్‌ స్వీకరించే రోజు నుండి ప్రక్రియ ముగింపు వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు ఇతరులను ఎవరు ప్రవేశించకుడదన్నారు. నామినేషన్‌ వేసే వారితోపాటు మరో నలుగురిని అనుమతి ఇస్తామని ఉదయం 11 గంటలకు నుండి సాయంత్రం 3 గంటల వరకు మామినేషన్ల పక్రియ జరుగుతుంద ని నామినేషన్ల పూర్తి ప్రక్రియను సీసీ కెమెరాలు ,వీడియో గ్రాఫింగ్‌ చేయబడుతుందని, నామినేషన్ల ప్రక్రియ పై అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పిడబ్ల్యు ఓటర్లు, 80 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఫామ్‌12 డి అందజేయడం జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సేకరణ బిఎల్‌ఓల విధుల గురించి ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లకు సంబంధించిన అన్ని వివరాల ప్రజా ప్రతినిధుల కు అందజేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార అవసరము నిమిత్తం వివిధ రకముల అనుమతుల కొరకు సువిధ వెబ్సైట్‌ https://suvidha.eci.gov.in ద్వారా అనుమతి కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు నిర్వహణకు, పార్టీ ర్యాలీలు, పార్టీ వాహనాల కొరకు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాలకు ,లౌడ్‌ స్పీకర్ల కొరకు, హెలికాప్టర్‌ మరియు హెలిపాడ్ల అనుమతుల కొరకు సువిధ
వెబ్సైట్‌ వెబ్సైట్‌ ద్వారా అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. కౌంటింగ్‌ హాల్స్‌ సూర్యాపేట జిల్లా పరిధిలో మొత్తం నాలుగు నియోజకవర్గంలో అనగా హుజూర్నగర్‌ 89, కోదాడ 90, సూర్యాపేట 91 ,తుంగతుర్తి 96, ఎన్నికల నిర్వహణ కొరకు పైన పేర్కొనబడిన నాలుగు నియోజకవర్గాల ఓటింగ్‌ యంత్రములు భద్రత కొరకు నియోజకవర్గ కేంద్రాల్లో స్టాంగ్‌ రుములలో భద్రపరచడం జరిగిందని, 30వ తారీకు పోలింగ్‌ అనంతరం సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ సంబంధించిన ఓటింగ్‌ యంత్రాలు ఈవీఎం , వివి ప్యాట్లు అన్ని సూర్యాపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలోగల స్టాంగ్‌ రూములలో భద్రపరచడం జరుగుతుందని మూడో తేదీన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో స్ట్రాంగ్‌ రూములకు ఎదురుగా,ప్రక్కన ఏర్పాటు చేయబడిన కౌంటింగ్‌ సెంటర్లలో నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్‌ వివరించారు .ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి రాజేశ్వ రరావు, భారతీయ జనతా పార్టీ నుండి ఆబీదు, బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి సత్యనారాయణ ,బిఎస్పీ పార్టీ నుండి స్టాలిన్‌ ,శ్రీనివాస్‌ , ఎన్నికల సూపర్డెంట్‌ శ్రీనివాసరాజు వేణు సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు