- నియామక పత్రం అందించిన ఆర్. కృష్ణయ్య..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం సెక్రెటరీగా ఈడ సుజాత నియమితులయ్యారు.. ఈ మేరకు నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. కృష్ణయ్య ఆమెకు నియామక పత్రం అందించారు.. బీసీ సంక్షేమం కోసం తాను నిర్విరామంగా, పాటుపడతానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు..