Thursday, September 19, 2024
spot_img

విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన ఎన్నికల సంఘం నిర్ణయం హర్షణీయం

తప్పక చదవండి

యువత ఓటు హక్కుకు అర్హత పొందగానే సత్వరం ఓటర్లుగా నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించు కునేలా అవగాహన చైతన్యం కల్పించటానికి విద్యార్థులకు 9 వ తరగతి నుండే ఓటు హక్కు ప్రజాస్వామ్యం ప్రభుత్వాల ఏర్పాటులో ఓటర్ల పాత్ర మొన్నగు అంశాలను తెలియ పరిచి అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ విద్యా మంత్రిత్వ శాఖతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సి.ఈ.సీ)రాజీవ్‌ కుమార్‌ గురువారం నాడు అధికారికంగా ప్రకటించడం హర్షణీయం అని తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. ‘‘నేటి బాలలు రేపటి పౌరులు అనేది కాకుండా నేటి బాలలు నేటి పౌరులే ‘‘అన్న స్పృహ కలిగించి సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద అవగాహన కలిగించాలి. పాఠశాల స్థాయిలోనే రాజ్యాంగం హక్కులు’ ఓటింగ్‌ విధానం చట్టసభల ఏర్పాటు గురించి అవగా హన కలిగించాలి. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ‘‘ఐకాన్‌ గా’’ ప్రముఖ హిందీ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్‌ నియామకాన్ని గురువారం అధికారికంగా ప్రకటిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడిరచారు. పాఠశాల ‘కళాశాల స్థాయిలో ప్రజాస్వామ్యం ‘స్వరూపం స్వభావం పట్ల ‘రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించటానికి పాఠ్య ప్రణాళికలో ప్రజాస్వామ్యాన్ని పాటంశంగా ప్రవేశ పెట్టాలనేది సి.ఈ.సీ ప్రణాళిక అని పేర్కోవడం గమనార్హం. ఓటింగ్‌ హక్కు నమోదు వినియోగం ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ సవాళ్లు పరిష్కారాల మీద విద్యార్థుల్లో ప్రతిభా పాటవ పోటీలు క్విజ్‌ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుతులు ఇవ్వాలి. విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర గురించి యువత అర్థం చేసుకుంటే ఓటర్లుగా నమోదైన యువత ఓటింగులో పాల్గొంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వెయ్యాలి ఎందుకు ఓటు వెయ్యాలి? ఓటు హక్కు వినియోగం ద్వారా సమాజంలో కలిగే సామాజిక ఆర్థిక ‘రాజకీయ’ ప్రభావాల మీద అవగాహన ఏర్పడి పాలనలో సమర్థత పారదర్శకత జవాబు దారీతనంతో కూడిన మెరుగైన సమాజ నిర్మాణంలో క్రియాశీల భాగస్వాములయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నికల కమిషన్‌.. నేర రాజకీయచరిత్ర వున్న అభ్యర్థులను ప్రారం భంలోనే అరికట్టే ప్రక్రియ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో తప్పుడు అఫిడవిట్లు తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికేట్‌ దాఖలు చేసిన వారిపై గెలిచిన తర్వాత హైకోర్టు ‘ సుప్రీమ్‌ కోర్టులో కేసులు వేయడం పదవీ కాలము ముగిసే సమయానికి గెలిచిన అభ్యర్థి ఎన్నిక చెల్ల దంటూ కోర్టులు తీర్పులివ్వడం సాధారణ మైంది. ఎన్నికల పై దాఖలైన వాజ్యం ఎన్నికైన 6 నెల్ల లోపు పరిష్కరించాలి. ఎన్నికల వాజ్యాల విచారణ తీర్పులో జరుగుతున్న అనవసర జాప్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ఎన్నిక మీధ కోర్టులు సత్వరమే తీర్పులు ఇచ్చే విధంగా న్యాయ ‘పాలన సంస్కరణలు చేపట్టాలి. ఎన్నికల కమిషన్‌ మరియు న్యాయ వ్యవస్థ మీధ విశ్వసనీయతను పెంచడానికి ఎన్నికల కమిషన్‌ ‘న్యాయ కమిషన్‌ సమగ్రమైన చర్యలు తీసుకోవాలి .ఎన్నికల కమిషన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల నేర చరిత్ర వారి మీధ రిజిస్టర్‌ అయిన కేసులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లేదా జిల్లా స్థాయి క్రైం బ్యూరో నుండి ఆధునిక డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషన్‌ ఒక వారం రోజుల్లో అభ్యర్థుల నేర చరిత్ర వారి ఆస్తులు అప్పులకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలి. అభ్యర్థులు సమర్పించిన సమాచారాన్ని కమిషన్‌ సేకరించిన సమాచారంతో చెక్‌ చెయ్యాలి. సమాచారంలో తేడా తేలితే అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించాలి. కేంద్ర ఎన్నికలసంఘం సమగ్ర సంస్కరణలు అమలు చెయ్యాలి.అందుకు తగిన చట్టబధ్ధ మైన కార్యాచరణకు పూనుకోవాలి. ఎన్నికల ప్రచారంలో కుల తత్వం మతతత్వం ప్రాంతీయ అభిమానం హింసను ప్రేరే పించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించిన అభ్యర్థు లను ఎన్నికల్లో పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. సోషల్‌ మీడియాలో వ్యక్తి దూషణ ‘కుల దూషణకు పాల్పడ్డ తప్పుడు ప్రచారాలు చేసిన ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హామీలు’ ఆర్థిక ప్రలోభాలు తాయిలాలు ‘ఓటర్లకు నగదు ‘మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్‌ తీసు కోవాలి. ఎన్నికల కమి షన్‌ నిర్ణయించిన షరతులను నియమ నిబంధనలకు పాటించని అభ్యర్థులను ఎన్నికల పోటీ నుండి తప్పి ంచాలి. ఎన్నికల్లో తప్పులు చేసిన అభ్యర్థుల జాబితాను పత్రికల్లో ప్రకటించి వారిని ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హు లుగా ప్రక టించాలి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రద్దు చేయాలి. అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన సమయం తర్వాత ప్రచారం చేస్తే భారీ జరిమానా విధించాలి. ఎన్నికల సమయంలో పట్టుబడిన నగదు డబ్బును ‘‘ఎన్నికల ప్రత్యేక నిధికి’’ జమ చెయ్యాలి .మద్యాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి. పోలింగ్‌ రోజు కంటే 2 రోజుల ముందు బారులు బెల్ట్‌ షాపులు క్లోజ్‌ చెయ్యాలి మధ్య ప్రవాహం మనీ ప్రభావాన్ని అడ్డుకునే చర్యలు కఠిన తరం చేయాలి .ఎన్నికలు స్వేచ్ఛా యుత వాతావరణంలో నిర్వహించాలి. ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగును మరింత సులభతరం చెయ్యాలి. సీనియర్‌ సిటిజన్స్‌ ‘వికలాంగులు ఇంటి నుండే ఆన్లైన్‌ లో ఓటు వేసే సౌకర్యం కల్పించాలి. ఎన్నికల అక్షరాస్యత పరి వ్యాప్తితో ఎన్నికల కమిషన్‌ ఓటర్లు అందరూ విధిగా ఓటింగులో పాల్గొనేట్లు విరివిగా ప్రచారం చెయ్యాలి. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పా ట్లలో స్వతంత్ర ప్రతి పత్తితో వ్యవహరిం చాలి. ఓటరు నమోదు ‘దొంగ ఓటర్ల బెడద కొత్త ‘ఓటర్ల నమోదు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేయడం లో జవాబుదారీతనం పారదర్షని కతకు పెద్ద పీట వేయాలి.కొత్త ఓటర్ల నమోదు కొరకు గ్రామాల్లో వార్డ్‌ స్థాయిలో మరియు పట్టణాలలో రెసిడెన్షియల్‌ అసోసియే షన్స్‌ సభ్యులను భాగస్వాములను చెయ్యాలి. ఎన్నికలకు 2 నెలల ముందు ఓటర్ల జాబితా బూతు స్థాయిలో ప్రకటించాలి. ఓటర్లకు కేటాయించిన నియోజక వర్గం పేరు పోలింగ్‌ కేంద్రం మొన్నగు వివరాలు ప్రతి ఓటరుకు అందుబాటులో ఉంచాలి. పౌరులు ఓటింగ్‌లో పాల్గొ నేట్లు ఎన్నికల కమిషన్‌ ‘ప్రభుత్వం ‘స్వచ్ఛంద సంస్థలు ‘పౌర సమాజం మీడియా ప్రతినిధుల ప్రజా స్వామ్య నిర్మాణంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి చైతన్యం గలఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకొని ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉద్యమించాలి.
` నేదునూరి కనకయ్య 9440245771

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు