Friday, September 20, 2024
spot_img

మోటోరోలా నుండి బెండింగ్‌ ఫోన్‌..

తప్పక చదవండి
  • ఎన్నెన్నో విశేషాలు కలిగిన ఫోన్..

ఒకప్పుడు ఫీచర్‌ ఫోన్‌.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఇక బెండింగ్‌ ఫోన్‌ వంతు వస్తున్నది. అమెరికన్‌ బహుళజాతి టెలీకమ్యూనికేషన్‌ దిగ్గజం మోటోరోలా.. ఈ బెండింగ్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. తమ మాతృ సంస్థ లెనోవా ‘టెక్‌ వరల్డ్‌ 2023’లో అత్యాధునిక ప్రోటోటైప్‌ బెండింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా పరిచయం చేసింది. మడత ఫోన్లకు అప్‌డేట్‌ మోడల్‌గా వస్తున్న ఈ బెండింగ్‌ ఫోన్లను ఏకంగా చాప చుట్టినట్టు చుట్టేయవచ్చు. చేతికి వాచీ, బ్రేస్‌లెట్‌లాగా కూడా ధరించవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కస్టమర్లు దీన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నిజానికి 2016 టెక్‌ వరల్డ్‌ ఈవెంట్‌లోనే దీన్ని సంస్థ పరిచయం చేసింది. అయితే ఇప్పుడీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తొందర్లోనే తెచ్చేందుకు మోటోరోలా సిద్ధమవుతున్నది. అయితే ధర, ఇతరత్రా వివరాలను ప్రకటించాల్సి ఉన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు