Friday, November 1, 2024
spot_img

బాబర్ కెప్టెన్సీపై వేటు..

తప్పక చదవండి
  • కొత్త సారధులుగా మిస్బా-ఉల్-హక్, ముహమ్మద్ హఫీజ..?
  • బాబర్ నిరంకుశత్వానికి ముగింపు..

వన్డే ప్రపంచకప్ 2023 లో ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ పై విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్‌పై వన్డేల్లో పాకిస్థాన్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమి తర్వాత పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలో, ఒక పేలుడు షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. 2023 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్‌ ను కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2024 టి 20 ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంది. ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ఆడకుండా జట్టు స్వదేశానికి తిరిగి వస్తే బాబర్ కెప్టెన్సీకి రాజీనామా చేయవచ్చని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ‘బాబర్ బ్యూరోక్రాట్ అయిపోయాడు. ఎందుకంటే, ఆయనకు నాయకుడిగా అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. ప్రధానంగా అతను కోరిన ఆటగాళ్లు ఎప్పుడూ జట్టులో ఆడేవారు. అలాగే ఆయన అధికారాన్ని తగ్గించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఆసియా కప్, ప్రపంచ కప్ ఓటమికి బాబర్ ఇప్పుడు పూర్తి బాధ్యత వహిస్తాడు” అని పీటీఐ నివేదించింది. భారత్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేయాలని మాజీ జట్టు కెప్టెన్లు మిస్బా-ఉల్-హక్, ముహమ్మద్ హఫీజ్ పట్టుబట్టారు. కానీ, ఆసియా కప్, ప్రపంచ కప్ కోసం, బాబర్ కోరిన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేశారు. మిస్బా, హఫీజ్, మరికొందరు మాజీ ఆటగాళ్ల సలహాలను పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్ పట్టించుకోలేదు. ఎందుకంటే పీసీబీ మాజీ ఆటగాళ్ల కంటే బాబర్ మాటలకే ఎక్కువ క్రెడిట్ ఇచ్చింది. తద్వారా జట్టు ఓటమికి బాబర్ కారణమని పాకిస్థాన్ బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయని పీటీఐ నివేదించింది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు