Thursday, September 19, 2024
spot_img

నీ జీవితాన్ని నువ్వే శాసించుకోవాలి..

తప్పక చదవండి

అవసరానికి వాడుకొని వదిలేసి గుణం నాకు లేదు.. ప్రేమగా పలకరిస్తే ఎప్పుడూ నా వాళ్లే అనుకోని పొంగిపోయే మనసు నాది.. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి.. సరిదిద్దుకోవాలి.. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ.. రెండు పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు.. ఒకటి చేయగలననే ఆత్మ విశ్వాసం.. రెండు చేయలేనెమో అన్న అపనమ్మకం.. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి.. మనలో మంచిని చూపించే వాళ్ళు ఆప్తులు అవుతారు.. చెడును చూపినవాళ్ళు శత్రువులు అవుతారు.. రెండింటిని సమానంగా చూసినవాళ్లు మనల్ని ప్రేమించిన వాళ్ళు ఆవుతారు.. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి.. కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుని చేస్తాయి. నింద వేయడం సులభమే దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు.. మాట జారడం సులభమే.. కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి.. కట్టె కాలి బూడిద అయినా.. మాట పడుతూ బతికే ఉంటుంది.. కనుకనే ఆచి తూచి మాట్లాడాలి.. గర్వం ఒక్కటీ చాలు సర్వం కోల్పోవడానికి.. కోపం ఒక్కటి చాలు ఆప్తులను పోగొట్టుకోవడానికి..

  • గాడిపెల్లి మధు..
    సీనియర్ జర్నలిస్ట్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు