Thursday, September 19, 2024
spot_img

ప్రవళిక – కన్నీటి లేఖ

తప్పక చదవండి

అవే అర్థనాదాలు
అవే నినాధ సునాధాలు
ఆనాడు స్వరాష్ట్ర సిద్దికోసం
ఈనాడు స్వరాష్ట్రములో
ఉద్యోగ సాధన కోసం?
ఏమి మారింది?
బతుకు మారిందా?
బట్ట మారిందా?
భౌగోళిక సరిహద్దులు తప్ప
ప్రశ్నించడం తప్ప
నిరసనలు,ధర్నాలు తప్ప
అవే లాఠీలు
అవే లూటీలు
కాకపోతే కొ కొత్త స్కాంలు
బర్రెలు- గొర్రెలు
సారెలు బతుకమ్మ చీరలు
స్కీమ్ లు నాయకుల స్కాంలు
ప్రజలకు చెవులో పువ్వులు
ప్రశ్న పత్రాల
లీకేజిలు-ప్యాకేజ్ లు
పరీక్షల రద్దులు వాయిదాలు
ఇవన్నీ గమనించక
ఓ చిట్టి చెల్లి
గత రెండు సవత్సరాలుగా
తాను కలలు కన్న కల కోసం
కన్నతల్లిని కన్న ఊరిని వదిలి
ఉద్యోగమే జీవితంగా
ఊపిరిగా బతికి
చివరికి బతుకు చిద్రమైంది
మరి లేఖ రాసి బలైపోయింది
నన్ను క్షమించు అమ్మ అని
నేను చాలా
నష్టజాతకురాలు నని
నా వల్ల నేను మీరు ఎప్పుడు బాధపడుతునే ఉన్నారని
మీకు ఏమి చేయలేక పోతున్నానని
బలితీసుకుంది ఈ బంగారు చెల్లి

కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రవళిక
ఈ లేఖతో నైనా
మార్పు రావాలి
యువత మేల్కోవాలి
తీరు మారాలి
రాబోయే ఎన్నికల యుద్ధంలో
ఓటు అనే ఆయుధంతో
బుద్ది చెప్పాలి
ఈ కల్లబొల్లి నాయకులకు
నయా వంచకులకు
ఓ కొత్త తీర్పు ఇవ్వాలి

- Advertisement -

ఇదే మన చెల్లికి
ఇచ్చే అసలు సిసలు అయినా
ఘన నివాళి
అమ్మ ప్రవళిక
మీ ఆశయ సాధనలో మేమిక
ఇక నీకు సెలవిక

(బంగారు తెలంగాణ లో ఉద్యోగం సాధన కోసం తన ప్రాణాన్ని అర్పించిన చెల్లి ప్రవళిక కు అశ్రునయనాల ,అక్షర ఘన నివాళులు లతో…)

  • శ్రీను కొండ్రపల్లి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు