Friday, September 20, 2024
spot_img

‘‘అన్ని పార్టీలకు రైతే ప్రధాన ఎజెండా’’!

తప్పక చదవండి

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్‌ 30వ తేదీన రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు ఆడుకునే పనిలో పడ్డాయి. ఓట్లను ఆకర్షించే వివిధ రకాల పథకాలను ప్రకటిస్తున్నాయి. అది ఆచరణ సాధ్యమా?కాదా? అని కూడా చూడడం లేదు. అన్ని పార్టీలకు అధికారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నూటికి 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ డబ్బై శాతం మంది ఓట్లు ప్రధానమైనవి. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టా రైతులు ఉన్నారు. సుమారు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి 90 లక్షల కుటుంబాల ఓట్లు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానున్నాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా హామీలు ఆకర్షణీయమైన పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా వ్యవసాయ రంగం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా1995 నుండి 2021 వరకు 3,86,250 మంది రైతులు, తెలంగాణ వ్యాప్తంగా 1995 నుంచి 2021 వరకు 32, 460 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. (ఆధారం: చీజRదీ) (2022 సంవత్సరం రైతు ఆత్మహత్య వివరాలు ఇప్పటివరకు చీజRదీ వెల్లడిరచలేదు.)ప్రతిరోజు దాదాపుగా 2000 మంది వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస పోతున్నారు. మిగతావారు కూడా ఇతర మార్గాలు లేక వ్యవసా యం కొనసాగిస్తున్నారు. ఇతర రంగాల్లో పనిచేసే వారందరూ వారి పిల్లలు అదే రంగంలో కొనసాగాలని కోరుకుంటారు. కానీ వ్యవసాయదారులు మాత్రం వారి పిల్లలు వ్యవసాయంలో కొనసా గవద్దని కోరుకుంటారు. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ముందు ‘‘రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు’’. అని తూతూ మంత్రంగా ఆయా పార్టీలు వ్యవసాయ రంగ సమస్యలన్నీ మా ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని వారి వారి మేనిఫెస్టోలో పెడుతూ, ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తూ తర్వాత మేనిఫెస్టోలోని అంశాలను, ఎన్నికల వాగ్దానాలను ఉపన్యాసాలు మరిచి పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనా లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ రైతులను, రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపో తుడడం సహజంగా మనకు ప్రతి సారి కనబ డుతున్న దృశ్యం. దేశంలో గాని రాష్ట్రంలో గాని ఇప్పటివరకు వ్యవసాయ విధానం లేకపోవడం చాలా బాధాకరం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా అదేవిధంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన స్వామినాథన్‌ కమిషన్‌ లాంటి కమిషన్‌ సిఫారసులు అమలు చేయకపోవడం దురదృష్టకరం. తెలంగాణ నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం (భారత రాష్ట్ర సమితి) వ్యవసాయ రంగంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు రైతు బీమా, రైతు బంధు, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంట కొనుగోలు కేంద్రాలు, రైతు రుణమాఫీ లాంటి పథకాలు ప్రవేశపెట్టడంతో గతంలో కంటే తెలంగాణ వ్యవసాయ రంగంలో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. రైతుబంధు:-పెట్టుబడి సహాయం కింద నేరుగా రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున నగదును అందిస్తున్న పథకం. దాదాపు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు సుమారు కోటి 40 లక్షల ఎకరాలకు రైతు బంధువులు అందిస్తుంది. కానీ రైతుబం ధుకు పరిమితి లేకపోవడంతో భూమి ఎంత ఉన్నా, సాగు చేసినా, చేయకున్నా ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడంతో సంవత్సరానికి సుమారు 700 కోట్ల రూపాయలు సాగు చేయని భూములకు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందిన పట్టాదారులకు ఇస్తున్నట్లు అంచనా. కేవలం 10 ఎకరాల లోపు సాగు చేసిన భూములకు మాత్రమే వర్తింపజే యాలి. రైతు బీమా :-18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు పట్టా పాస్‌ బుక్‌ ఉన్న ప్రతి రైతుకు ఏ కారణం చేతనైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా సంస్థలు చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణ జిల్లాలలో చిన్న సన్నకారు రైతుల భూములు కుటుంబ పెద్ద అయినా తండ్రి లేదా తల్లి పేరు మీదనే భూములు పట్టాలు ఉంటాయి. వాళ్ల కొడుకులు వ్యవ సాయం చేస్తూ అప్పుల బాధతో ఆత్మహత్యలు వివిధ కారణాల చేత చనిపోయిన వీరికి బీమా వర్తించదు. కాబట్టి కుటుంబాన్ని యూనిట్‌ గా తీసుకొని కుటుం బంలో అర్హులైన ప్రతి వాస్త వ్యవసాయదారునికి రైతు బీమాను వర్తింపజేయాలి. బీమా వయస్సు 18 నుంచి 75 సంవత్సరాల పెంచాలి. రైతు రుణమాఫీ:- బ్యాంకులలో వ్యవసా యం కోసం చేసిన పంట రుణాలను ప్రభుత్వాలు ఏకకాలంలో మాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులు డిఫాల్టర్ర్‌ గా మిగలడంతో ఇవాళ బ్యాంకు లు రైతులకు రుణాలు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఏ ప్రభుత్వమైనా పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలి. మద్దతు ధర:-దేశవ్యాప్తంగా సుమారు 600 రకాల పంటలు పండిస్తున్న కేవలం 22 రకాల పంటలకు మాత్రమే నామమాత్రంగా మద్దతు ధరను (వీూూ) ప్రకటిస్తున్నాయి. ఈ మద్దతు ధరతో కనీసం పెట్టు బడులు కూడా రాకపోవడంతో అప్పులపాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సంగతి మనం నిత్యం పత్రికలలో చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ రూపంలో ఇచ్చే అవకాశం మన రాజ్యాంగం కల్పించి ంది. అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభు త్వం క్వింటాలుకు 1000 రూపాయల చొప్పున బోనస్‌ రూపంలో ఇస్తే రైతులకు లాభం జరుగుతుంది. వాస్తవ సాగుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పంటల బీమా పథకం:-ప్రతి వస్తువుకు బీమా పథకం ఉన్న మన దేశంలో ఎండనక, వాననక కుటుంబం అంతా ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినప్పుడు ఆ రైతును ఆదుకునే బీమా వ్యవస్థ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో కాబట్టి పంట నష్టపోయిన ఒక నెలలోపు ఆ పంట నష్టాన్ని అంచనా వేసి రైతు యూనిట్‌ గా నష్టపరిహారం చెల్లించే ఒక సమగ్రమైన వ్యవస్థను రూపొందించాలి. కౌవులురైతులు:-రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు వాస్తవ సాగుదారులు, వీరిని రైతులుగా గుర్తించి అన్ని రకాల ప్రభుత్వ స్కీములను వర్తింపజేయాలి. కౌవులు రేటును నియంత్రించాలి. రుణమాఫీ:-రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలి. రైతులందరికీ వడ్డీ లేని రుణాలను అందించాలి. టిఆర్‌ఎస్‌ మాత్రం రైతుల కోసం ఎన్నో పథకాల అమలు చేస్తున్నామని రాష్ట్ర రైతులందరు తమ వైపే ఉన్నారని ధీమాతో ఉంది. రైతు బంధు దశలవారీగా 16 వేల రూపాయలకు పెంచుతామని, రైతు బీమా తరహాలో అర్హులైన పేదలకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, గతంలో కొనసాగించిన పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, రైతు భరోసా కింద ఏడాదికి 15 వేల రూపాయలు చెల్లిస్తామని అలాగే కౌలు రైతులకు కూడా ఈ భరోసా పథకాన్ని వర్తింప చేస్తామని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని, పంటల బీమా పథకం అమలు, చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. బిజెపి పార్టీ మాత్రం ఇప్పటివరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారే మేమే అధికారంలోకి వస్తామంటూ రైతుల ఓట్ల మీద భరోసాతో ఉన్నాయి. రైతులకు అత్యధికంగా ఉపయోగపడే పథకాలు ఆ పథకాలను నెరవేర్చగలిగే పార్టీలవైపే ఓట్లు వేస్తామని రాష్ట్ర రైతాంగం ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర రైతాంగం ఏ పార్టీకి పట్టం కట్టనుందో వేచి చూద్దాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు