Thursday, September 19, 2024
spot_img

ముద్రణ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి..

తప్పక చదవండి
  • ఉత్పత్తి శ్రేణిలో మోనో, కలర్ విభాగాలు ఉంటాయి..
  • ప్రతి ఒక్కటి కూడా కార్యాలయాలలో ఉత్పాదకత..
  • ముద్రణ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి..

హైదరాబాద్ : భారతదేశంలోని ఆఫీస్ ప్రింటింగ్ సాంకేతికత స్థితిగతులను పునర్నిర్వచించ టానికి సిద్ధంగా ఉండడంలో భాగంగా భారతదేశంలో రికో ఉత్పత్తుల విశిష్ట భాగస్వామి అయిన మినోషా ఇండి యా లిమిటెడ్, తరువాతి తరం లేజర్ ప్రింటర్‌ల అసాధారణ శ్రేణిని సగర్వంగా ఆవిష్కరించింది. ఈ సంచలనా త్మక ఉత్పత్తి శ్రేణి రెండు విభిన్న విభాగాలను కలిగి ఉంది.. మోనో, కలర్. వీటిలో ప్రతి ఒక్కటి కూడా ఆఫీస్ ప్రింటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, అత్యుత్తమ నాణ్యతను అందించడానికి వీలుగా రూపొందించబడింది. ఈ వినూత్న ప్రింటర్‌లు సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తాయి. అంతేగాకుండా మినోషా, రికో రెండింటికీ ప్రసిద్ధి చెందిన శ్రేష్ఠత, అభివృద్ధి స్ఫూర్తిని ప్రతిబింబిస్తా యి. ఆవిష్కరణ, బహుముఖ ప్రజ్ఞ, భద్రతపై ప్రత్యేక దృష్టితో, మినోషా ఇండియా లిమిటెడ్ భారతదేశం అంతటా వ్యాపార సంస్థల డైనమిక్ అవసరాలను తీర్చడానికి, అధిగమించడానికి రూపొందించబడిన ఆఫీస్ ప్రింటింగ్ సొల్యూషన్స్ కొత్త శకానికి నాంది పలుకుతోంది. అన్ని ప్రింటర్‌లు వై ఫై తో పని చేసేలా ఉంటూ, విలువైన కస్టమర్‌లకు స్మార్ట్ పరికర కనెక్టర్, రిమోట్ పరికరాల నిర్వాహణకి, జాతీయస్థాయిలో సేవా భాగస్వాముల పటిష్ఠ నెట్‌ వర్క్‌ తో కూడిన అత్యుత్తమ ఆన్‌సైట్ సేవను అందిస్తాయి. భారతదేశంలో లేజర్ ప్రింటర్ శ్రేణి ధర రూ. 30,000/- నుండి ప్రారంభమవుతుంది.

ఈ ఆవిష్కరణ గురించి మినోషా ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ థాకర్ మాట్లాడుతూ, “నాణ్యత, విశ్వాసం, అందుబాటు అనేవి మినోషా ఇండియా శాశ్వత వారసత్వానికి పునాది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో, ఈ సూత్రాలు మా గుర్తింపును నిర్వచించాయి. శ్రేష్ఠత పట్ల మా తిరుగులేని నిబద్ధతకు మార్గనిర్దేశం చేశాయి. మార్కెట్ డైనమిక్స్ సంక్లిష్టత అభివృద్ధి చెందుతూనే ఉంది.. ఈ ప్రధాన విలువలను సమర్థించడంలో మాత్రం మేం దృఢ నిశ్చయంతో ఉంటాం. అవి మమ్మల్ని ముందుకు నడిపించే దిక్సూచి అని మాకు తెలుసు’’ అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు