Thursday, September 19, 2024
spot_img

పోలీస్‌ లాఠీ చార్జ్‌కు నిరసనగా అంగన్వాడీల ధర్నా

తప్పక చదవండి

ఎల్బీనగర్‌ : పోలీసుల లాఠీ చార్జ్‌ కు నిరసనగా అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు ఆవరణలో కేసీఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగిన ముట్టడిని విచ్ఛిన్నం చేయుట కొరకు సిడిపివోలు, సూపర్వైజర్లు ఇతర ఎన్ని విధాలుగా వేధించినా ఆగకుండా ముట్టడిని జయప్రదం చేయడంతో సహించని కేసిఆర్‌ ప్రభుత్వము పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసర నర్సిరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక పర్యాయాలు తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో విధిలేని పరిస్థితిలో సమ్మెకు వెళ్లడం జరిగిందని సమస్యలు పరిష్కారం చేయకపోగా అనేకమంది అంగన్వాడీ కార్యకర్తలను లాఠి చూపించి పోలీసు యంత్రాంగం బూట్లతో తొక్కి చిత్రహింసలకు గురి చేశారని అయినా వాటన్నిటిని సహించి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగించారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము తన నియంతృత్వ పోకడలను విరమించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పెంచిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కీసర నర్సిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి ఎల్లయ్య, ఎం వీరయ్య, వృత్తిదారుల నాయకుడు సిహెచ్‌ వెంకన్న, కెవిపిఎస్‌ నాయకులు భీమనపల్లి కనకయ్య, వృత్తిదారుల సంఘం నాయకులు చెన్నారం మల్లేశం, ప్రజా నాట్యమండలి నాయకుడు గోపి పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అంగన్వాడి యూనియన్‌ నాయకులు సిహెచ్‌ సుకన్య కుమారి, గంగ, సరళ, రేణుక, గౌరీ, నీలమణి, రబియా, సత్యమ్మ, మాణిక్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు